Russia China Master Plan : రష్యా, చైనాల వ్యాక్సిన్ అస్త్రం.. మాస్టర్ ప్లాన్

కరోనాతో కకావికలమైన ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి రష్యా, చైనా వేగంగా పావులు కదుపుతున్నాయి. అమెరికా, యూరప్‌లో తయారైన వ్యాక్సిన్ల కన్నా ముందే.. అభివృద్ధి చెందని..

Russia China Master Plan : కరోనాతో కకావికలమైన ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి రష్యా, చైనా వేగంగా పావులు కదుపుతున్నాయి. అమెరికా, యూరప్‌లో తయారైన వ్యాక్సిన్ల కన్నా ముందే.. అభివృద్ధి చెందని.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి మాస్టర్‌ ప్లాన్ వేశాయి. భారీగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాయి. దీని కోసం రష్యా.. చైనా మధ్య ఓ అగ్రిమెంట్ కూడా కుదిరింది.

వివిధ దేశాలకు సరఫరా అవుతున్న లక్షలాది స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లపై మేడిన్‌ చైనా అనే లేబుల్‌ ఉండడం ఇందుకు రుజువుగా కనిపిస్తోంది. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ 26 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు చైనా కంపెనీలు నెల రోజుల క్రితం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం 60 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్లను సరిపడా సరఫరా చేయకుండా పాశ్చాత్య దేశాలు స్వార్థంగా వ్యవహరిస్తున్నాయంటూ వ్యతిరేకతనూ మూటగట్టడానికి ఈ రెండు
దేశాలూ ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో అమెరికా, యూకే వ్యాక్సిన్ల విశ్వాసాన్ని దెబ్బ తీసేలా రష్యా, చైనా దేశాలు
మాట్లాడుతుండడం దీనికి బలం చేకూర్చేలా ఉంది.

ట్రెండింగ్ వార్తలు