Vladimir Putin
Russia – ICBM: రష్యా అడ్వాన్స్డ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించిందని రోస్కోస్మోస్ స్పేస్ ఏజెన్సీ (Roscosmos space agency) చీఫ్ యూరి బోరిసోవ్ తెలిపారు. తమ శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడాలంటే రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వచ్చేలా చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఇప్పటికే హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో రష్యా అణ్వాయుధ సామర్థ్యమున్న సర్మత్ క్షిపణులను మోహరించింది. పూర్తి యుద్ధ సన్నద్ధతతో వీటిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలపలేదు. రష్యాలో ఉన్న అడ్వాన్స్డ్ ఆయుధాలలో సర్మత్ ఒకటి.
అనేక న్యూక్లియర్ ఆయుధాలను వాడుతూ శత్రువులపై అది దాడి చేయగలదు. తమ దేశాన్ని బెదిరించే ప్రయత్నాలు చేసేవారికి, తమ గురించి దురుసుగా మాట్లాడేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని పుతిన్ గతంలో చెప్పారు. రష్యాను సర్మత్ సురక్షితంగా ఉంచడానికి తోడ్పడుతుందని గుర్తుచేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాకు మొదటి నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయినప్పటికీ వెనక్కుతగ్గడం లేదు.
Egyptian billionaire : ఈజిప్ట్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫాయెద్ కన్నుమూత