Russia Fires Agian Kalibr : యుక్రెయిన్‌పై రష్యా భీకరదాడి.. మరోసారి కాలిబర్‌ మిస్సైల్ ప్రయోగం

యుక్రెయిన్‌ నుంచి ప్రతిఘటన పెరుగుతున్న కొద్దీ దాడులను తీవ్ర తరం చేస్తోంది రష్యా. అమ్ములపొది నుంచి శక్తిమంతమైన అస్త్రాలను బయటకు తీస్తోంది.(Russia Fires Agian Kalibr)

Russia Fires Agian Kalibr : యుక్రెయిన్ పై రష్యా సేనల భీకర దాడులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్‌పై బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తూనే ఉంది రష్యా. తాజాగా మరోసారి కాలిబర్ మిస్సైల్ ను రష్యా ప్రయోగించింది. వాయువ్య యుక్రెయిన్‌ లోని జైతోమిర్ నగరానికి సమీపంలోని ఆయుధాలు, సైనిక పరికరాలతో కూడిన డిపోను తమ క్షిపణులు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

నల్ల సముద్రంలోని నౌక నుంచి ప్రయోగించిన నాలుగు కాలిబర్‌ క్షిపణులు.. కీవ్‌కు పశ్చిమాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డిపోను ధ్వంసం చేశాయని రక్షణశాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ వెల్లడించారు. గత 24 గంటల్లో యుక్రెయిన్‌కు చెందిన మొత్తం 117 సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామని, ఇందులో ఆరు కమాండ్ పోస్టులు, మూడు విమానాలు ఉన్నాయని చెప్పారు. కాగా, దీర్ఘ శ్రేణి క్రూజ్ మిస్సైల్ కాలిబర్‌ను రష్యా ఇప్పటికే రెండుసార్లు ప్రయోగించింది.

Russia ukraine war : యుక్రెయిన్ పై యుద్ధంలో టార్గెట్స్ మిస్ అవుతున్న రష్యా..60 శాతం మిస్సైల్స్ విఫ‌లం

యుక్రెయిన్‌ నుంచి ప్రతిఘటన పెరుగుతున్న కొద్దీ దాడులను మరింత తీవ్ర తరం చేస్తోంది రష్యా. తన అమ్ములపొది నుంచి కీలక, శక్తిమంతమైన అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్ పై రెండుసార్లు కింజల్ హైపర్‌ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన పుతిన్ సేనలు ఆ తర్వాత మరో శక్తిమంతమైన అస్త్రం కాలిబర్ క్షిపణిని బయటకు తీశాయి.

దీర్ఘ శ్రేణి క్రూజ్ మిస్సైల్ కాలిబర్‌ను రష్యా మరోసారి ప్రయోగించింది. గురువారం క్రిమియాలోని సెవస్ట్‌పోల్ వద్ద సముద్రంపై రష్యన్ కార్వెట్టి నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించారు. యుక్రెయిన్‌లోని ఒర్జెవ్‌ గ్రామంలోని సైనిక స్థావరంపై దాడి చేసినట్లు తెలిపింది. ఈ ప్రదేశం కీవ్‌కు 200 మైళ్ల దూరంలో ఉంది. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి అందిన ఆయుధాలను కూడా ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Russia Fires Agian Kalibr Missile On Ukraine From Black Sea

శత్రుదేశాల గగనతల వ్యవస్థలను ఛేధించుకుంటూ వెళ్లి భూమిపై ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయడంలో కాలిబర్‌ క్షిపణికి పెట్టింది పేరు. ఈ క్షిపణులను అత్యంత కీలకమైన లక్ష్యాలపై మాత్రమే రష్యా ప్రయోగిస్తుందని నిపుణులు అంటున్నారు. భూమికి తక్కువ ఎత్తులో ఈ మిస్సైల్ ప్రయాణిస్తుంది. దాదాపు 500 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగే కాలిబర్‌ క్షిపణి లక్ష్యాన్ని మార్గమధ్యంలోనే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. గోదాములు, కమాండ్ పోస్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు ఈ క్షిపణిని వాడతారు.

Russia Ukraine: యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం పూర్తయిందన్న రష్యా: ఆ తరువాత ఏంటి?

కాలిబర్ దీర్ఘశ్రేణ క్రూజ్ మిసైల్‌ను రష్యా ఉపయోగించడం ఇది మూడోసారి. మార్చి నెల మొదట్లో కూడా మైకలైవ్ నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించింది. ఆనాటి దాడిలో 8 మంది మృతిచెందారు. కాలిబర్‌ను అభివృద్ధి చేశాకా రష్యా 2015 అక్టోబర్‌లో తొలిసారిగా సిరియాపై ఈ క్షిపణిని రష్యా ప్రయోగించింది. కాస్పియన్ సముద్రం నుంచి 26 కాలిబర్ క్షిపణులు సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రెబల్స్‌పై ప్రయోగించారు.

Russia Fires Agian Kalibr Missile On Ukraine From Black Sea

కాలిబర్ మిస్సైల్ ప్రత్యేకతలు..
* గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని వెళ్లి భూమిపై ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేసేలా కాలిబర్‌ క్షిపణిని అభివృద్ధి చేశారు.
* భూమికి తక్కువ ఎత్తులో సమాంతరంగా ఇది ప్రయాణిస్తుంది.
* మార్గం మధ్యలో దీని లక్ష్యానికి సంబంధించిన మార్గాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు.
* దీనిలో దాదాపు 500 కిలోల వార్‌హెడ్‌ను అమర్చవచ్చు.
* దీనిని గోదాములు, కమాండ్‌ పోస్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు వాడతారు.
* మార్చి నెల మొదట్లో కూడా రష్యా ఈ క్షిపణిని వాడి మైకలైవ్‌ నగరంపై దాడి చేసింది.
* నాటి దాడిలో 8 మంది మరణించారు.
* కాలిబర్‌ను అభివృద్ధి చేసిన తర్వాత 2015 అక్టోబర్‌లో సిరియాలో దీనిని ఉపయోగించింది.
* అప్పట్లో కాస్పియన్‌ సముద్రం నుంచి 26 క్షిపణులను సిరియా ప్రభుత్వ వ్యతిరేక వర్గంపై ప్రయోగించింది.

ట్రెండింగ్ వార్తలు