Russia Ukraine: యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం పూర్తయిందన్న రష్యా: ఆ తరువాత ఏంటి?

యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం దాదాపుగా ముగిసిందని.. ప్రస్తుతం డాన్బాస్ ను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు

Russia Ukraine: యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం పూర్తయిందన్న రష్యా: ఆ తరువాత ఏంటి?

Ukraine War

Russia Ukraine: దాదాపు నెల రోజులకు పైగా యుక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తుంది రష్యా. యుద్ధం కారణంగా ఇరు దేశాల్లోనూ తీవ్ర ఆర్ధిక నష్టంతో పాటు భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ యుద్ధంలో 1,351 మంది రష్యన్ సైనికులు మరణించారని, 3,825 మంది గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతుండగా, యుక్రెయిన్ మాత్రం 15,000 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైన నాటి నుండి ఉక్రెయిన్ లో 1,081 మంది మృతి చెందారని,1,707 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. అయితే, వాస్తవ లెక్కలు ఇందుకు బిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. యుక్రెయిన్లో పౌర మరణాలు సహా ఇరు దేశాల్లోనూ సైనిక మరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు యుక్రెయిన్ నిఘావర్గాలు వెల్లడించాయి.

Also Read:Andhra Pradesh : ఈనెల 29న కొత్త జిల్లాలకు తుదిరూపు ?

కాగా, గురువారం క్రెమ్లిన్లో జరిగిన ఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం దాదాపుగా ముగిసిందని.. ప్రస్తుతం డాన్బాస్ ను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. డాన్బాస్ మరియు లుహాన్స్క్ ప్రాంతాలలో రష్యా వేర్పాటువాదులు యుక్రెయిన్ సైన్యంతో పోరాడుతున్నాయి. అయితే డాన్బాస్ ను స్వతంత్ర ప్రాంతంగా రష్యా ప్రకటించినా పశ్చిమదేశాలు గుర్తించలేదు. అయితే నెల రోజులుగా జరుగుతన్న యుద్ధం కారణంగా డాన్బాస్ ప్రాంతంపై యుక్రెయిన్ బలగాల పోరాట సామర్ధ్యం గణనీయంగా తగ్గిందని దీంతో ఆ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకోవడం సులభం అయినట్లు రష్యన్ జనరల్ స్టాఫ్ మెయిన్ ఆపరేషనల్ డైరెక్టరేట్ అధిపతి సెర్గీ రుడ్స్కోయ్ అన్నారు.

Also Read:Chhattisgarh HC : భూకబ్జా కేసులో నోటీసులు..కోర్టు విచారణకు హాజరైన ‘పరమశివుడు’..!

అయితే పుతిన్ చేసిన ఈ ప్రకటనపై కొంత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రష్యా.. యుద్ధంపై వెనక్కు తగ్గాలని భావించిందని, అందుకు సరైన కారణం, సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం యుక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న రష్యా.. యుక్రెయిన్ లో మరియొపాల్, కీవ్ సహా ఏ ఒక్క నగరాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోలేకపోయింది. ఇది రష్యాకు భంగపాటు కలిగించే విషయం. దీంతో యుద్ధాన్ని కొనసాగించడం కంటే కాస్త వెనక్కుతగ్గడమే మంచిదన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు రష్యా వర్గాలే వెల్లడించడం విశేషం. యుక్రెయిన్ లో మొదటి దశ సైనిక చర్య ముగిసిందని స్వయంగా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం దాదాపుగా యుద్ధానికి ముగింపు పలకడమేనని, అయితే తదుపరి రష్యా చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read:Petrol Diesel Prices : దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో నాలుగోసారి