Russia : యుక్రెయిన్‌ పై యుద్ధం.. వ్యూహం మార్చిన రష్యా

లీవ్‌లోని యుక్రెయిన్‌ ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యన్‌ ఫైటర్‌ జెట్లు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు మిలటరీ ట్రైనింగ్‌ బేస్‌పై 8 మిసైల్‌ దాడులు జరిగాయి.

Russia attacked western Ukraine : యుక్రెయిన్‌ యుద్ధంలో రష్యా వ్యూహం మార్చింది. పశ్చిమ యుక్రెయిన్‌పై దృష్టి సారించింది. ఇప్పుడీ ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేశాయి రష్యన్‌ బలగాలు. లీవ్‌లో మిలటరీ ట్రైనింగ్‌ సెంటర్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. లీవ్‌లోని యుక్రెయిన్‌ ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యన్‌ ఫైటర్‌ జెట్లు దాడులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు మిలటరీ ట్రైనింగ్‌ బేస్‌పై ఎనిమిది మిసైల్‌ దాడులు జరిగాయి. రష్యా ఉన్నట్టుండి పశ్చిమ యుక్రెయిన్‌పై దాడి చేయడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

నాటో నుంచి యుక్రెయిన్‌ ఆర్మీకి అందుతున్న సాయం పొలండ్‌ మీదుగా లీవ్‌కే వస్తుందని రష్యా భావిస్తోంది. ఇక్కడి నుంచే యుక్రెయిన్‌ ఆర్మీకి ఆయధాలు సరఫరా అవతున్నాయన్న అనుమానాలు కూడా రష్యాకు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ ప్రాంతంపై నజర్‌ పెట్టింది. ముందుగా లీవ్‌లోని ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థను ధ్వంసం చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాడులు చేయాలన్న ఆలోచనలో రష్యన్‌ ఆర్మీ ఉంది.

Biological, Chemical Weapons : యుక్రెయిన్​-రష్యా యుద్ధం.. తెరమీదికి జీవ, రసాయన ఆయుధాలు

రష్యా యుక్రెయిన్‌ నగరాలపై ఒకే పద్ధతిలో దాడులు చేస్తోంది. ముందుగా అక్కడి ఆర్మీ బేస్‌లపై ఫస్ట్‌ వేవ్‌ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో అక్కడి ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్‌ను, ఎయిర్‌పోర్ట్‌లను ధ్వంసం చేసి.. ఆ తర్వాత పూర్థి స్థాయి బలగాలను, ట్యాంక్‌లను ఆ నగరాల్లో మోహరిస్తుంది. ఇప్పుడు రష్యా లీవ్‌పై కూడా ప్లాన్‌ను అమలు చేయబోతుంది.

యుక్రెయిన్-రష్యా యుద్ధం 18 రోజులకు చేరింది. రష్యా సైన్యం చేస్తున్న భీకర దాడులతో ఉక్రెయిన్ అల్లాడుతోంది. ఎటు చూసినా ధ్వంసమైన భవనాలు, శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల ఆంక్షలు, వాణిజ్య పరమైన ఇబ్బందులు వచ్చినా.. రష్యా లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్‌పై పట్టు కోసం వెనక్కి తగ్గకుండా బాంబులు, రాకెట్లను ప్రధాన నగరాలపైకి సంధిస్తోంది.

Russia Ukraine War : శరణార్థుల కాన్వాయ్‌ పై రష్యా కాల్పులు..చిన్నారితో సహా ఏడుగురు మృతి

మృతదేహాలను పూడ్చిపెట్టడానికైనా విరామం ఇవ్వని రీతిలో రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 1300 మంది ఉక్రెయిన్​ సైనికులు మృతి చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు​ జెలెన్​స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను రష్యా మరింత ఉద్ధృతం చేసింది. కీవ్‌తోపాటు పలు నగరాల్లో ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర పోరాటం సాగుతోంది.

మాస్కో పదాతిదళాలు కీవ్‌కు 15కిమీ సమీపానికి చేరుకున్నాయి. మరియుపోల్‌లో దాడులతో పౌరుల తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. మెలిటొపోల్‌ నగర మేయర్‌ను రష్యా బలగాలు అపహరించుకుపోయినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా యుద్ధం కొత్త దశలోకి మారింది. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఫోన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు.

 

 

ట్రెండింగ్ వార్తలు