Russia Soldiers
Russia Soldiers : రష్యా, యుక్రెయిన్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. వరుసగా 7వ రోజూ రష్యా సేనలు యుక్రెయిన్ పై దాడులు సాగించాయి. అయితే, భారీ ఎత్తున దాడికి తెగబడిన రష్యాకు.. యుక్రెయిన్ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. యుద్ధంలో రష్యా భారీగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు(Russia Soldiers) చనిపోయారు. అంతేకాదు యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూడా రష్యా కోల్పోయింది. యుక్రెయిన్ సైనికుల కంటే రష్యా సైనికులే ఎక్కువగా మృతి చెందినట్టు తెలుస్తోంది.
తాజాగా యుక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చెప్పిన వివరాల ప్రకారం గత 6 రోజుల్లో 6 వేల మంది రష్యా సైనికులను యుక్రెయిన్ మట్టుబెట్టింది. సైనికులను రవాణా చేసే 846 సాయుధ వాహనాలను ధ్వంసం చేసింది. 30 యుద్ధ విమానాలు, 31 హెలీకాప్టర్లు, 211 ట్యాంకులు, 85 ఆర్టిలరీ వ్యవస్థలను ధ్వంసం చేసింది. అంతేకాదు రష్యా పవర్ గ్రిడ్, రైల్వే వ్యవస్థలపై కూడా దాడి చేస్తున్నామని యుక్రెయిన్ తెలిపింది. కాగా, యుక్రెయిన్ ఆక్రమణ పూర్తయ్యే వరకు దాడిని కొనసాగిస్తామని రష్యా తేల్చి చెప్పింది.
Putin: 10 వేల డాలర్ల కంటే ఎక్కువ డబ్బుతో దేశం దాటి వెళ్లకుండా నిషేధం విధించిన పుతిన్
యుక్రెయిన్‌ను వశం చేసుకోవాలన్న కసితో సాగుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సంబంధించిన ఓ వార్తపై గడిచిన రెండు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. యుక్రెయిన్ ఎలాగూ లొంగేలా లేదు. ఇక పాశ్చాత్య దేశాలన్నీ ఆ దేశానికి అండగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యుక్రెయిన్‌పై అణుబాంబుతో విరుచుకుపడక తప్పదన్న భావనకు పుతిన్ వచ్చారట. అదే జరిగితే తన కుటుంబానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేలా తన ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన న్యూక్లియర్ బంకర్‌కు తరలించారనేదే ఆ వార్త సారాంశం. అయితే, ఈ వార్తలో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో తనపై ఆంక్షలు విధిస్తున్న అంతర్జాతీయ సమాజంపై పుతిన్ బెదిరింపులకు దిగుతున్నారు. తమ దగ్గర అణు బాంబులు ఉన్నాయని.. వాటిని యుక్రెయిన్‌పైనా, ఆ దేశానికి మద్దతుగా నిలిచే దేశాలపైనా వేస్తామని ఇదివరకు హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో యుక్రెయిన్‌పై యుద్ధం.. అణు యుద్ధంగా మారుతుందన్న భావనతో పుతిన్ ఉన్నారని రష్యా రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు ప్రొఫెసర్ వాలెరీ చెప్పారు. అందుకే అణు యుద్ధం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పుతిన్ పక్కాగానే ప్లాన్ చేసుకున్నారని, ఇందులో భాగంగా తన కుటుంబాన్ని సైబీరియాలోని భూగర్భ నగరానికి తరలించారని ఆయన ఆరోపించారు.
Ukraine-Russia: మూడో ప్రపంచం యుద్ధం అంటూ జరిగితే అది అణు యుద్ధమే: రష్యా విదేశాంగ మంత్రి
యుక్రెయిన్‌పై దాడుల జరిపి, ఆ దేశాన్ని తమ దారిలోకి తెచ్చుకోవాలని భావించిన రష్యాకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓ వైపు యుక్రెయిన్ ఎదురుదాడి.. మరోవైపు ఆ దేశానికి పలు దేశాల మద్దతు, ఆంక్షలు.. దీంతో రష్యా ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో మరిన్ని సవాళ్లు వస్తే.. వాటిని ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను కూడా వాడేందుకు రష్యా సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి.