Russia Lost
Russia Lost : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. గత 24 రోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. రష్యా బలగాలు.. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా దాడుల్లో ఇప్పటివరకు వందల సంఖ్యలో ఉక్రెయిన్‌కు చెందిన సైనికులు చనిపోయారు. ఈ దాడుల్లో వందలాది మంది అమాయక పౌరులు, చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉంటే, యుక్రెయిన్ సైనికులు కూడా ధీటుగానే పోరాటం సాగిస్తున్నారు. దీంతో ఈ యుద్ధంలో రష్యాకు భారీగానే నష్టం జరుగుతోంది. ఇప్పటివరకు రష్యాకు ఎంత నష్టం కలిగించింది యుక్రెయిన్ డిఫెన్స్ తెలిపింది. ఇప్పటివరకు 14వేల 400 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. దీంతోపాటు 466 ట్యాంకులు, 1470 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 95 విమానాలు, 115 హెలికాప్టర్లు, 17 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది.(Russia Lost)
వీటికి అదనంగా మూడు నౌకలు, 44 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది. సైనిక చర్య పేరుతో రష్యా చేస్తున్న యుద్ధంలో ఆ దేశ సైనిక దళానికి భారీగానే నష్టం జరుగుతోంది. ఎంతోమంది సైనికులు చనిపోయారు. ఎన్నో యుద్ధ వాహనాలు ధ్వంసం అయ్యాయి. యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి నేటితో 24 రోజులైంది. ఇంకా అనేక నగరాలపై రష్యా సేనలు దాడులతో హోరెత్తిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ యుక్రెయిన్‌లోని జపోరిజియా నగర శివార్లలో జరిగిన దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ నగరంలో 38 గంటల కర్ఫ్యూను ప్రకటించారు. ఇటీవల ఈ నగరంలోని ఓ అణు విద్యుత్ కేంద్రంపై దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసిన విషయం తెలిసిందే.
Russia-Ukraine War : యుద్ధం ఆపాలంటూ పుతిన్‌కు హాలీవుడ్ టెర్మినేటర్ స్టార్ విజ్ఞప్తి!
అటు మరియుపోల్‌ను చుట్టుముట్టిన రష్యా బలగాలు.. నగరంలోనూ దాడులు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే యూరప్ లోనే అతిపెద్ద మెటలర్జికల్ కర్మాగారాల్లో ఒకటైన అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్‌పై పట్టు కోసం రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య పోరు సాగుతోందని యుక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అయిన వాదిమ్ దెనిసెంకో తెలిపారు. ‘ఇప్పుడు అజోవ్‌స్టాల్ కోసం పోరాటం సాగుతోంది. అయితే.. ఈ ఆర్థిక దిగ్గజాన్ని కోల్పోయామని చెప్పగలను. యూరప్ లోని అతిపెద్ద మెటలర్జికల్ ప్లాంట్లలో ఒకటైన దీన్ని.. ధ్వంసం చేస్తున్నారు’ అని వాపోయారు.
David Cameron: యుక్రెయిన్ల కోసం స్వయంగా ట్రక్ నడుపుకుంటూ వెళ్లిన యూకే మాజీ ప్రధాని
కాగా, యుక్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యా బలగాలకు మద్దతుగా తమ ఫైటర్లను పంపుతున్నామన్న ఆరోపణలను లెబనాన్ మిలీషియా గ్రూప్ హిజ్బుల్లా ఖండించింది. హిజ్బుల్లా సెక్రెటరీ జనరల్ హసన్ నస్రల్లా ఈ వాదనలను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఇందులో నిజం లేదన్నారు. హిజ్బుల్లా నుంచి ఒక ఫైటర్ కానీ, నిపుణుడు కానీ యుక్రెయిన్‌కు వెళ్లలేదన్నారు. తమ దేశంలో పోరాడటానికి సిరియా, హిజ్బుల్లా నుంచి సుమారు వెయ్యి మంది ఫైటర్లను రష్యా నియమించుకున్నట్లు ఇటీవల యుక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే.