Russia Vs Ukraine: మిస్సైల్స్‌తో ఎటాక్.. యుక్రెయిన్‌పై ప్రతీకార దాడులు మొదలు పెట్టిన రష్యా..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హతమార్చేందుకు యుక్రెయిన్ రష్యా అధ్యక్ష భవనంపై డ్రోన్ దాడులు చేసిందని రష్యా ఆరోపిస్తుంది. ఫలితంగా భారీ స్థాయిలో ప్రతిదాడులు ఉంటాయని ప్రకటించింది. ఈ క్రమంలోనే యుక్రెయిన్‌పై ప్రతీకార దాడులను రష్యా మొదలు పెట్టింది.

Russia Vs Ukraine: రష్యా (Russia) యుక్రెయిన్ (Ukraine)  మధ్య మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంవత్సర కాలంగా రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా సైన్యం  (Russian army) యుక్రెయిన్‌పై మిస్సైల్స్‌ (Missiles) తో దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా దాడులతో వేలాది మంది మరణించారు. ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఇరుదేశాలకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డారు. తాజాగా బుధవారం తెల్లవారు జామున రష్యా అధ్యక్ష భవనం (Russian Presidential Palace) క్రెమ్లిన్ (Kremlin) పై రెండు డ్రోన్ దాడులు జరిగినట్లు వీడియోలు వైరల్ గా మారాయి.

Ukraine: పుతిన్‌ను చంపడానికి డ్రోన్లతో దాడి చేశారన్న రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందన

అయితే, రష్యా భద్రతా దళాలు డ్రోన్లను భవనం వద్ద పేల్చేసినట్లు రష్యా తెలిపింది. ఎవరికీ ఎలాంటి గాయం కాలేదని, క్రెమ్లిన్ భవనానికి నష్టం జరగలేదని రష్యా తెలిపింది. రెండు డ్రోన్లు రష్యా అధ్యక్ష భవనంపైకి దూసుకొచ్చిన సమయంలో పుతిన్ అక్కడ లేరని, మాస్కో అవల నోవో ఒగర్యోవో నివాసంలో సురక్షితంగా ఉన్నారని ఆయన అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు.

Russia presidential palace Kremlin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హతమార్చేందుకు యుక్రెయిన్ ఈ డ్రోన్ దాడులు చేసిందని రష్యా ఆరోపిస్తుంది. ఫలితంగా భారీ స్థాయిలో ప్రతిదాడులు ఉంటాయని రష్యా ప్రకటించింది. ఈ క్రమంలోనే యుక్రెయిన్‌పై ప్రతీకార దాడులను రష్యా మొదలు పెట్టింది. యుక్రెయిన్‌పై మిస్సైల్స్‌తో రష్యా దాడులు నిర్వహిస్తోంది. షాపింగ్ సెంటర్లు, సూపర్ మార్కెట్లు, రైల్వే స్టేషన్లపై  మిస్సైల్స్ తో దాడులు చేస్తోంది. ఈ రష్యా దాడుల్లో 21 మంది మృతి చెందినట్లు, మరో 50 మందికి గాయాలైనట్లు తెలిసింది. అయితే, రష్యా మిస్సైల్స్ దాడులపై యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యామాత్రం జెలెన్ స్కీని చంపుతామని, ఆమేరకు తమ దాడుల లక్ష్యం ఉంటుందని, తమ దగ్గర మరో ప్రత్యామ్నాయం లేదని రష్యా పేర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్యకు యత్నం.. దాడులు.. క్రెమ్లిన్‌ వద్ద పొగలు.. వీడియో

ఇదంతా రష్యా డ్రామానే అంటున్న యుక్రెయిన్.. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయడానికి తాము డ్రోన్లను పంపి దాడికి యత్నించామంటూ వస్తున్న ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. తమకు ఏ సంబంధమూ లేదని స్పష్టం చేసింది. తాము క్రెమ్లిన్ పై డ్రోన్ దాడి చేయలేదని చెప్పింది. అసలు ఇటువంటి చర్యల వల్ల ఉక్రెయిన్ కు చేకూరే లాభము ఏమీ ఉండబోదని, అంతేగాక, రష్యాను మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని చెప్పింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ వివరణ ఇచ్చారు. క్రెమ్లిన్ పై ఉక్రెయిన్ దాడులు చేయబోదని, ఇటువంటి దాడులు తమ మిలటరీ లక్ష్యాలు కాదని చెప్పారు. ఈ దాడి అంతా రష్యా డ్రామా అని అన్నారు. ఉక్రెయిన్ పై “ఉగ్ర” దాడులు చేయడానికి ముందుగా రష్యా ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు