Russia Suspend Ceasefire : ఉక్రెయిన్​లో తాత్కాలికంగా కాల్పులు విరమించిన రష్యా

పౌరుల తరలింపు కోసం కాల్పుల విరమణ చేసినట్లు రష్యా తెలిపింది. పౌరుల తరలింపునకు అవలంభిస్తున్న విధానాన్ని ఉక్రెయిన్​ తెలియజేయాలని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.

Firing

Russia suspend ceasefire : ఉక్రెయిన్​లో రష్యా ఇవాళ తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. ఐదు ప్రధాన నగరాల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్‌, చెర్నిహివ్‌, ఖార్కివ్‌, సుమి, మరియుపోల్ నగరాల్లో కాల్పుల విరమిస్తున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మానవతా కారిడార్​ ఏర్పాటు కోసం రష్యన్​ ఫెడరేషన్ కాల్పుల విరమణ ప్రకటించింది. పౌరుల తరలింపు కోసం కాల్పుల విరమణ చేసినట్లు రష్యా తెలిపింది. పౌరుల తరలింపునకు అవలంభిస్తున్న విధానాన్ని ఉక్రెయిన్​ తెలియజేయాలని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.

రాతపూర్వక ఆమోదం, ఆయా మార్గాల్లో భద్రతకు హామీ ఇవ్వాలని పేర్కొంది. మార్చి10న రష్యా, ఉక్రెయిన్ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా భేటీ కానున్నారు. అటు పౌరుల తరలింపు కోసం యుక్రెయిన్‌ కారిడార్లు తెరిచింది. అయితే కాల్పుల విరమణ ప్రకటించినా రష్యా దాడులు చేస్తోందంటు యుక్రెయన్ ఆరోపిస్తోంది.

Ukraine-Russia : రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడో విడత చర్చల్లో పురోగతి

ఇక సుమిలో పౌరుల తరలింపు వేగవంతం చేసే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. ఇప్పటికే 20వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించింది. కాల్పుల విరమణ ప్రకటించినా రష్యా దాడులు చేస్తోందని యుక్రెయన్ అంటోంది.
అటు రష్యా తన దురాక్రమణలో భాగంగా యుక్రెయిన్‌లోని చాలా నగరాల్లో మారణకాండ సృష్టించింది.

కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడిచింది. యుద్ధ నియమాలను తుంగలో తొక్కి.. జనావాసాలపై విరుచుకుపడింది. ఖార్కివ్‌ నగరంపై దాడులు చేసినట్లుగా యుక్రెయిన్‌ చెబుతోంది. భూతల, గగనతలాల నుంచి దాడులు కొనసాగుతుండడంతో.. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలిపింది. ఇక రష్యాకు పెద్దఎత్తునే ఎదురు దెబ్బలు తగిలినట్లు యుక్రెయిన్‌ సైనిక దళాలు చెబుతున్నాయి.

Russia Unfriendly Countries : అన్‌ఫ్రెండ్లీ కంట్రీస్‌.. తన వ్యతిరేక దేశాల జాబితాను ప్రకటించిన రష్యా

ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న 30 రష్యన్‌ హెలికాప్టర్లను ధ్వంసం చేశామని మరైన్‌ కంట్రోల్‌ అధికారులు వెల్లడించారు. అటు ఖెర్సోన్‌, కీవ్‌, చెర్నిహివ్‌, మైకొలైవ్‌ నగరాలపై పట్టుకోసం రష్యన్‌ సేనలు భీకర పోరు సాగిస్తున్నాయి. రష్యా కాల్పుల్లో హోస్టొమెల్‌ మేయర్‌ యూరి చనిపోయారు. ఇక ఖార్కివ్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో మోహరించిన 30 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్‌ మరైన్‌ విభాగం ప్రకటించింది.

మైకొలైవ్‌ నగరంపైనా రష్యా దాడులు చెసిందని.. అయితే రష్యాకు చెందిన ఒక సుఖోయ్‌ విమానాన్ని నేలకూల్చామని వెల్లడించంది. ఇక కీవ్‌ సమీపంలోని విషోరొడ్‌ ప్రాంతంలో ఒక రష్యా హెలికాప్టర్‌ను గాల్లోనే పేల్చేసినట్లు యుక్రెయిన్‌ తెలిపింది. జప్రోజియాలో ఆరు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. హులియపోల్‌, ఒరిఖివ్‌, చాలాచినో నగరాల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాలను యుక్రెయిన్‌ సేనలు ప్రతిఘటిస్తున్నాయి.