Russia-Ukarine: ఇండియా సాయం కోరుతున్న యుక్రేనియన్ ఎంపీ సోఫియా

రష్యా చేస్తున్న దాడులతో తీవ్ర నష్టానికి గురి కాగా, దీంతో యుక్రెనియన్ ఎంపీ సోఫియా ఫెడైనా తమకు ఇండియా నుంచి ఫార్మాసూటికల్ సాయం కావాలని కోరారు.

Russia-Ukarine: ఇండియా సాయం కోరుతున్న యుక్రేనియన్ ఎంపీ సోఫియా

Russia Ukraine

Updated On : February 25, 2022 / 5:22 PM IST

Russia-Ukarine: రష్యా చేస్తున్న దాడులతో యుక్రెయిన్ రాజధానితో పాటు పలు ప్రాంతాలు తీవ్ర నష్టానికి గురయ్యారు. ప్రజానీకంపై కూడా బాంబుల దాడి ప్రభావం కనిపిస్తుంది. దీంతో యుక్రెనియన్ ఎంపీ సోఫియా ఫెడైనా తమకు ఇండియా నుంచి ఫార్మాసూటికల్ సాయం కావాలని కోరారు.

‘యుక్రెయిన్ కు ఆయుధాలతో పాటు సైకలాజికల్ సాయం కూడా చాలా అవసరం. మాస్కో నుంచి మాపై దాడులు జరుపుతున్న వ్యక్తిని శిక్షించాలి. శాంతియుతంగా జీవించే యుక్రెయినియన్లను హతమారుస్తున్నారు. మా దేశంలోని పౌరుల మానవ హక్కులను కాపాడాలని ఇండియన్ పొలిటీషియన్స్ ను కోరుతున్నా’ అని అన్నారు సోషియా.

యుక్రెనియాలోని ఒడెస్సా ప్రాంతంలో బాంబు షెల్టర్ లో ఉండి మాట్లాడిన ఆమె.. దేశమంతా Kyivఆధీనంలోనే ఉందని ఏ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకోలేదని వెల్లడించారు. యుక్రెనియన్ విదేశాంగ శాఖ మంత్రి మైత్రో కులేబా రష్యా మిలటరీని తిట్టిపోశారు. గతంలో అంటే 1941లో నాజీలు Kyivపై దాడి జరిపారని గుర్తు చేశారు.

Read Also : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి కేంద్రబిందువు.. గుత్తాధిపత్యానికి కారణమిదేనా..?

చెర్నోబైల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను ఆధీనంలోకి తీసుకున్న రష్యన్ బలగాలు యుక్రెయిన్ లో అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయంటూ దేశధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ శుక్రవారం అన్నారు.