Killing Of Civilians In Bucha Of Ukraine
Killing of civilians in Bucha of Ukraine : 40 రోజులకు పైగా యుక్రెయిన్ పై రష్యా విలతాండవం చేస్తోంది. మృత్యువు యుక్రెయిన్ లో రాజ్యమేలుతోంది. యుద్ధం మొదలైన కొన్ని వారాలు యుక్రెయిన్ సైన్యంపైనే టార్గెట్ చేసింది. కానీ ఇప్పుడలా కాదు. సామాన్య జనాలపై కూడా రష్యా విరుచుకుపడుతోంది. వరస ఊచకోతలు కోస్తోంది. రష్యా చేస్తున్న దాడులతో యుక్రెయిన్ ధ్వంసం కావటమే కాదు శవాల దిబ్బంగా మారుతోంది. దేశం ఎటు చూసినా శ్మశానంగానే కనిపిస్తూ బీతావహంగా కనిపిస్తోంది. నగరాలు శవాల దిబ్బలుగా మారుతున్నాయి.యుక్రెయిన్ రాజధాని కీవ్ కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా నగరంలోని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.భీతావహంగా ఉంది. బుచా నగరంలో రష్యా సేనలు ప్రజలను ఊచకోత కోశాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ గా మారి చూసినవారందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
Also read : sri lanka crisis: కలిసి పనిచేద్దాం రండి.. ప్రతిపక్ష పార్టీలను కోరిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స
బుచా నగరంలో ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. ఈ నగరం నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకున్నాక… అక్కడకు వెళ్లి చూసిన వారికి ఒళ్లు గగుర్పొడుస్తోంది. వందలాది మందిని రష్యన్ సైనికులు హతమార్చారు. చాలా మృతదేహాలను చూస్తే వారిని నేలపై పడుకోబెట్టి, చేతులు వెనక్కి కట్టి, తల వెనుక భాగం నుంచి కాల్చి చంపినట్టు తెలుస్తోంది. పారిపోతున్న సామాన్యులను కూడా రష్యా సేనలు విచక్షనారహితంగా కాల్చి చంపారు. రష్యా సేనల తూటాలను నేలరాలిన పక్షుల్లా పేవ్ మెంట్ల మీద మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. బుచా పట్టణంలో 20 మృతదేహాలు పడి ఉన్నాయి. రష్యా సేనలు యుక్రెయిన్ వాసులను కాల్చి చంపే సమయంలో వారి చేతులు వెనక్కి విరిచి చట్టి తలపై కాల్చి చంపినట్లుగా ఉన్నాయి.
దాదాపు 300 మంది సాధారణ పౌరుల మృతదేహాలకు ఒకే చోట సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. వీరిలో ఒక పసిబిడ్డ కూడా ఉండటం గమనార్హం. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో వారిని రష్యా సైనికులు పొట్టనపెట్టుకున్నారని బుచా మేయర్ అనతోలి ఫెడొరికి ఆవేదన వ్యక్తం చేశారు.
Also read : Scrap Ambassdor : 1000 కిలోల స్ర్కాప్ మెటీరియల్ తో అంబాసిడర్ కారు తయారు చేసిన కళాకారుడు
మృతదేహాలను సామూహికంగా సమాధి చేయటానికి మార్చి 10న ఆండ్రూ చర్చి వద్ద గుంత తవ్వినట్లుగా కనిపిస్తోంది. తాజాగా మార్చి 31న చర్చి సమీపంలో సుమారు 45 అడుగుల పొడవైన కందకం తవ్వినట్లు కనిపిస్తోంది. అని మాక్సర్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఈ దయనీయ దృశ్యాలు ఉన్నాయని మీడియా సంస్థలు వెల్లడించాయి. ఒక చర్చిలో సామూహిక ఖననం జరిపిన దగ్గర.. మృతదేహాల చేతులు, కాళ్లు పైకి పొడుచుకువచ్చాయి. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిపిన మారణకాండ అని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా మండిపడ్డారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నవారినీ రష్యా సైనికులు వదలలేదని బుచా మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు.