Ukraine Using Drones That Drop Petrol Filled Bottles Onto Invading Russian Troops
Russia ukraine war : రష్యా సేనలు యుక్రెయిన్ పై విరుచుకుపడుతుంటే అక్కడ సామాన్య ప్రజలే సైనికుల్లా మారి రష్యా సేనలపై పరోక్ష యుద్ధానికి దిగుతున్నారు. ఈ యుద్ధంలో మహిళలు కూడా పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చి పిలుపుతో ఇంట్లో మూలన పడి ఉన్న పాత బీరు సీసాలతో మహిళలు పెట్రో బాంబులు తయారు చేస్తున్నారు. ఆ బీరుసీసా పెట్రో బాంబుల్ని డ్రోన్లకు కట్టి వాటితో రష్యా సేలలపై దాడులు చేయనున్నారు. మాతృభూమిని రక్షించుకోవటం కోసం మహిళలు తమవంతుగా పెట్రో బాంబులతో యుద్ధాలు చేయనున్నారు.
యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేయటానికి రష్యా సేతలు దూకుడుగా దూసుకొస్తున్నాయి. కీవ్ ను సమీపిస్తున్నాయి. దీంతో నగర ప్రజలు మొలటోవ్ కాక్‌టేల్ బాంబులను సిద్ధం చేసి..డ్రోన్లతో రష్యా సేనలపై దాడులు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మొటటోవ్ కాక్‌టేల్ బాంబులను పెట్రోల్ బాంబులు అంటారు. యుక్రెయిన్ మహిళలు ఇంట్లో రహస్యంగా ఆ బాంబులను తయారీ చేస్తున్నారు.
తాజాగా కీవ్ సమీపంలో డ్రోన్ ద్వారా ఆ బాంబులను వాడారు. దూసుకువస్తున్న రష్యా బలగాలపై దాడి కోసం డ్రోన్ ద్వారా పెట్రోల్ బాంబులు వదలనున్నారు. యుక్రెయిన్ రక్షణ దళాలు ఈ డ్రోన్‌ను డెవలప్ చేశాయి. తమ వద్ద ఉన్న డ్రోన్లను ఇవ్వాలని యుక్రెయిన్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఆదేశాలు జారీ చేసింది.బీరు బాటిళ్లలో నింపిన పెట్రోల్, ఇతర పదార్థాలకు నిప్పు అంటించిన తర్వాత వాటిని శత్రువులపై దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు.
Also read : Russia Forces : యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి ప్రవేశించిన రష్యా బలగాలు
కానీ డ్రోన్ ద్వారా వదిలే మొలటోవ్ కాక్‌టేల్ బాటిల్ ఎలా పేలుతుందో స్పష్టంగా తెలియదు. కానీ డ్రోన్ నుంచి కిందకు పడుతున్న సమయంలో బాటిల్ నుంచి ఎటువంటి ద్రవం జారిపడడంలేదు. టార్గెట్‌ను చేరుకున్న తర్వాతే కాక్‌టేల్ బాంబు పేలుతున్నట్లు గుర్తించారు. కీవ్‌ను సమీపిస్తున్న రష్యా బలగాలపై కురిసేందుకు డ్రోన్ బాంబులు సిద్ధంగా ఉన్నాయి. మరి మహిళలు తయారు చేసిన ఈ బీరు సీసా పెట్రో బాంబులతో రష్యా సేనలు వెనక్కి తగ్గుతాయా? యుక్రెయిన్ బీరు సీసా బాంబుల యుద్ధ తంత్రం ఫలిస్తుందో లేదో చూడాలి.