Russia-Ukraine war: మాతృదేశం కోసం తుపాకి పట్టిన మహిళా ఎంపీ..‘మహిళలు కూడా ఈ మట్టిని రక్షిస్తారు’అని ట్వీట్

రష్యా నుంచి తమ దేశాన్ని రక్షించుకోవటం కోసం యుక్రెయిన్ మహిళా ఎంపీ తుపాకీ చేతపట్టారు..‘మహిళలు కూడా ఈ మట్టిని రక్షిస్తారు’అంటూ ఆమె యుద్ధానికి సిద్ధమంటున్నారు.

Ukraine Women Mp Kira Rudik Takes Up Arms To Fight Russia Ukraine War

Ukraine Women MP Kira Rudik takes up arms to fight Russia Ukraine war :
మూడవ రోజు కూడా రష్యా సేనలు యుక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు మరింతగా విజృంభిస్తున్నాయి. యుక్రెయిన్ లో అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన ఆదేశాలతో త్రివిధ దళాలు యుక్రెయిన్ పై పూర్తి ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మాతదేశం కోసం పోరాడటానికి సైన్యమే కాదు సామాన్య ప్రజలు కూడా ‘మేము సైతం’అంటున్నారు. ఈక్రమంలో యుక్రెయిన్ మహిళా ఎంపీ ‘రింగ్ ఉక్రెయిన్’ మాజీ సీఈవో కిరా రుడిక్ కూడా కదనరంగంలోకి దిగేందుకు సై అంటున్నారు. ‘‘మహిళలు కూడా మాతృదేశపు మట్టిని రక్షిస్తారు’అంటూ ట్వీట్ చేశారామె.

Also read : Ukraine Grandma : ‘నా దేశం యుక్రెయిన్‌ కోసం యుద్ధానికి సిద్ధం’అంటున్న 79 ఏళ్ల బామ్మ..

రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతూ దేశ రాజధాని కీవ్‌ను సమీపించిన వేళ మాతృభూమిని రక్షించుకునేందుకు సామాన్య ప్రజలు, క్రీడాకారులే కాదు వృద్ధులు కూడా మా దేశం కోసం మేమున్నాము అంటున్నారు. మహిళలు కూడా కదన రంగంలోకి దిగుతున్నారు. రష్యా సేనల ముందు తాము నిలబడలేమని తెలిసినా మాతృభూమి పరిరక్షణ కోసం అడుగు ముందుకే వేయాలనే లక్ష్యంతో దూసుకెళుతున్నారు.

ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో ఏకే-47 చేబట్టి ఇప్పటికే కదన రంగంలోకి దిగారు. అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా సైనిక దుస్తులు ధరించి ప్రజల్లో స్ఫూర్తి రేపారు. ఆయనిచ్చిన పిలుపుతో వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు మాతృదేశం కోసం పోరాడటానికి ఉద్వేగంగా ముందుకు అడుగులేస్తున్నారు.

Also read : Ukraine-Russia War: ‘యుక్రెయిన్‌ కోసం ఆయుధాలు పట్టనున్న ‘బాక్సింగ్‌ లెజెండ్ బ్రదర్స్‌’

దేశానికి చెందిన ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ సోదరులు విటాలీ క్లిట్స్ చ్కో, వ్లాదిమిర్ క్లిట్స్ చ్కో మాతృదేశం కోసం యుద్ధంలో పాల్గొంటామని ప్రకటించారు. విటాలీని అభిమానులు ముద్దుగా ‘ఉక్కు పిడికిలి’ అని పిలుచుకుంటారు. వ్లాదిమిర్ పేరులో రష్యా అధ్యక్షుడి పేరున్నా యుక్రెయిన్ కోసం పోరాడతామంటున్నారు. రాజధాని కీవ్ కు 2014 నుంచి విటాలీ మేయర్ గా ఉన్నారు.

ఈ కదనరంగ ఉద్వేగంలో ఉక్రెయిన్ ఎంపీ, ‘రింగ్ ఉక్రెయిన్’ మాజీ సీఈవో కిరా రుడిక్ కూడా నేను సైతం కదనరంగంలోకి దిగటానికి రెడీగా ఉన్నానంటూ ప్రకటించారు. రష్యా దురాక్రమణ నుంచి..రష్యాకు తమ దేశాన్ని అప్పగించేది లేదంటూ మా దేశాన్ని మేం రక్షించుకుంటాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. దాని కోసం కిరా రుడిక్ అత్యాధునిక ఏకే-47 తుపాకి చేతపట్టిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కలాష్నికోవ్‌ను ఉపయోగించడం నేర్చుకుంటానని..మన దేశపు వీరులకు తోడుగా నేను యుద్ధం చేస్తానని..మహిళలు కూడా మాతృదేశ మట్టిని కాపాడతారని ఆమె పేర్కొన్నారు.

Also read : Russia – Ukraine: యుక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు నేను సైతం అంటోన్న 80ఏళ్ల వ్యక్తి

కిరా పోస్టుకు చక్కటి స్పందన వస్తోంది. ఆమె ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. తుపాకిని ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఒక్క తూటాని కూడా వృథాగా పోనివ్వొద్దని సలహా ఇస్తున్నారు. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కాగా నాదేశాన్ని రక్షించుకోవటానికి ‘నా దేశం యుక్రెయిన్‌ కోసం యుద్ధానికి సిద్ధం’అంటున్న 79 ఏళ్ల బామ్మ.. ‘‘నేను సైనికుల్లా దృఢమైన సైనికురాలిని కాకపోవచ్చు.. బరువైన ఆయుధాలను మోయలేకపోవచ్చు.. కానీ, నా దేశం కోసం పోరాడతాను..నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడను..నా దేశాన్ని ఓడిపోనివ్వను…నా దేశం కోసం నేను సైతం’’.. అంటోంది ఉక్రెయిన్‌కు చెందిన 79ఏళ్ల బామ్మ వాలెంటినా కోన్‌స్టాంటీనొవాస్కా. ఆమె ఉద్వేగంతో ఆమె పలికే మాటలు వింటే దేశంలో ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.