Russia – Ukraine: యుక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు నేను సైతం అంటోన్న 80ఏళ్ల వ్యక్తి

రష్యా - ఉక్రెయిన్ ఆర్మీ బలగాలు యుద్ధంలో మునిగిపోయాయి. ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో 80ఏళ్ల వృద్ధుడు ఆర్మీలోకి జాయిన్..

Russia – Ukraine: యుక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు నేను సైతం అంటోన్న 80ఏళ్ల వ్యక్తి

Russia Ukarine

Russia – Ukraine: రష్యా – ఉక్రెయిన్ ఆర్మీ బలగాలు యుద్ధంలో మునిగిపోయాయి. ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. యుక్రెయిన్ ప్రెసిడెంట్ తో సహా ఆర్మీలోకి జాయిన్ అయి తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో 80ఏళ్ల వృద్ధుడు ఆర్మీలోకి జాయిన్ అయ్యేందుకు వచ్చాడు.

యుక్రెయినియన్ ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు లైన్ లో నిల్చొండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్యాగ్ తగిలించుకుని ఎదురుచూసిన అతణ్ని చూస్తే కంట నీరు రాకుండా ఉండదని రాసి మరొకరు ఫొటో షేర్ చేశారు.

’80ఏళ్ల వృద్ధుడు ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు వచ్చిన ఫొటోను ఎవరో తీసి పోస్టు చేశారు. రెండు టీ షర్టులు, ప్యాంట్స్, టూత్ బ్రష్, శాండ్ విచెస్ తో వచ్చారు. ఇదంతా తాను తన మనమళ్ల కోసం చేస్తున్నానని చెబుతున్నాడు’ అంటూ పోస్టు చేశారు.

Read Also : రష్యా-యుక్రెయిన్ పేలుళ్ల మధ్య.. పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన జంట..!

దేశం కోసం ధైర్యం చూపించి ఈ వయస్సులోనూ ముందడుగేసిన అతణ్ని చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. 1991లో యుక్రెయిన్ స్వాతంత్య్రాన్ని కళ్లారా చూసిన తాను.. దేశం కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు.