Kamala Harris To Visit Poland, Romania
Kamala Harris To Visit Poland, Romania : 10వ రోజు కూడా రష్యా బలగాలు యుక్రెయిన్ పై విరుచుకుపడుతున్న క్రమంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ యుక్రెయిన సరిహద్దుల్లో పర్యటించాలనే నిర్ణయం హాట్ హాట్ గా మారింది. యుక్రెయిన్ యుద్ధం వేళ కమలా హారిస్ యుక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలండ్, రొమేనియా దేశాల్లో కీలక పర్యటన చేపట్టనున్నారు. కమలాహారిస్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
క్రెయిన్‌లో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రాజధాని కీవ్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు రష్యాన్ బలగాలు భీకర దాడులు చేస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లుతోంది. మరోవైపు రష్యా దుందుడుకు చర్యతో భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. రష్యాపై ఆంక్షలు పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా యుక్రెయిన్ పై యుద్ధానికి వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమే కమలాహారిస్ పర్యటన ముఖ్య ఉద్దేశమని కమలా హారిస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ తెలిపారు.
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలండ్, రొమేనియా దేశాల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వచ్చే వారంలో కమలా హారిస్ ఆ దేశాల్లో పర్యటించనున్నారు. కమలా హారిస్.. మార్చి 9-11 మధ్య పోలండ్‌లో రాజధాని వార్సా, రొమేనియాలోని బుకారెస్ట్‌లో పర్యటించనున్నట్టు సబ్రినా వెల్లడించారు. ఈ క్రమంలో ఆ రెండు దేశాల నేతలతో సమావేశమై.. రష్యా యుక్రెయిన్ చేసే యుద్ధం తద్వారా ఏర్పడిన సంక్షోభంపై చర్చించనున్నారని సబ్రినా వెల్లడించారు.
Also read: Topless protesters : యుక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటూ బట్టలు విప్పేసిన మహిళలు
అలాగే యుక్రెయిన్‌కు భద్రత, ఆర్థిక, మానవతా సాయం వంటి కీలక అంశాలపైనా కూడా చర్చ జరుగనున్నట్టు సమాచారం. కాగా..ఈ చర్చలు యుద్ధం ఆపటానికి ఓ యత్నంతో పాటు యుక్రెయిన్ కు ఆర్థిక పరమైన అండ, మానవతా సహాయమే తప్ప రష్యాపై యుక్రెయిన్ తరపున అమెరికా యుద్ధం చేయదనే విషయాన్ని గమనించారు. యుక్రెయిన్ తరపున రష్యాపై తాము తాము ప్రత్యక్షంగా యుద్దంలో పాల్గొనబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ యుక్రెయిన్ సరహద్దు దేశాల్లో పర్యటన ఆసక్తికరంగా మారింది.