Topless protesters : యుక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటూ బట్టలు విప్పేసిన మహిళలు

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ఫెమెన్ అనే మహిళా సంఘం వాలంటీర్లు రష్యా ఎంబసీ ముందు అర్దనగ్న ప్రదర్శనతో ఆందోళన చేశారు. తమ పైదుస్తులు విప్పేసి నిరసన తెలిపారు.

Topless protesters : యుక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటూ బట్టలు విప్పేసిన మహిళలు

Topless Protesters

Topless protesters : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యద్ధం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నాయి. కాగా, సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని యావత్ ప్రపంచం తప్పుపడుతోంది. పుతిన్ వెంటనే యుద్ధం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా, పుతిన్ వినడం లేదు. వెనక్కితగ్గడం లేదు. యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు.

యుక్రెయిన్ పై యుద్ధం ఆపాలంటూ రష్యాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు తమ నిరసన తెలుపుతున్నారు. తాజాగా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ఫెమెన్ అనే మహిళా సంఘం వాలంటీర్లు రష్యా ఎంబసీ ముందు అర్దనగ్న ప్రదర్శనతో ఆందోళన చేశారు. తమ పైదుస్తులు విప్పేసి నిరసన తెలిపారు. వారు తమ ఛాతిపై ‘పుతిన్ యుద్ధాన్ని ఆపు’ అనే నినాదాలు రాసుకున్నారు. గతంలో సెక్స్ టూరిజంకు వ్యతిరేకంగా ఈ వాలంటీర్లు ఇదే తరహా నిరసన తెలియజేశారు.

Russia ukraine war : ‘బలి చేయటానికే ట్రైనింగ్‌లో ఉన్న మమ్మల్ని యుద్ధానికి పంపారు’ రష్యా సైనికుల ఆవేదన

రష్యా- యుక్రెయిన్ మ‌ధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా సేనలు యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ప‌లు కీల‌క న‌గ‌రాల‌ను కూడా స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా యూర‌ప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్ర‌మైన జ‌పోరిజియాపై ర‌ష్యా సేనలు దాడుల‌కు దిగాయి. ఈ దాడిలో జ‌పోరిజియా ప్లాంట్ ప్ర‌మాదానికి గురైంది. ఫైరింగ్ వ‌ల్ల ఆ ప్లాంట్‌లో మంట‌లు వ్యాపించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మంట‌లను ఫైర్‌ఫైట‌ర్స్
ఆపిన‌ట్లు శుక్రవారం తెలిపారు. న్యూక్లియ‌ర్ ప్లాంట్‌లో ఉన్న ప‌వ‌ర్ యూనిట్ల‌ను అక్క‌డే ఉన్న సిబ్బంది మానిట‌ర్ చేస్తున్నార‌ని స్థానికులు తెలిపారు. ప్లాంట్ దాడిలో రియాక్ట‌ర్ నెంబ‌ర్ వ‌న్‌లో స్వ‌ల్పంగా డ్యామేజ్ జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు.

Topless protesters march on Russian embassy against Putin's brutal Ukraine invasion

Topless protesters march on Russian embassy against Putin’s brutal Ukraine invasion

ఒక‌వేళ ఆ అణు కేంద్రం పేలి ఉంటే ప‌రిస్థితి ఎంత భ‌యాన‌కంగా ఉండేదో ఊహించడమే కష్టం అన్న అభిప్రాయం వ్యక్తమైంది. జ‌పోరిజియా న్యూక్లియ‌ర్ ప్లాంట్ యూరోప్‌లోనే పెద్ద అణు విద్యుత్తు కేంద్రం. ఆ ప్లాంట్‌లో మొత్తం ఆరు రియాక్ట‌ర్లు ఉన్నాయి. ఒక‌వేళ ఆ ప్లాంట్‌లో పేలుడు జ‌రిగి ఉంటే, దాని
ప్ర‌భావం చెర్నోబిల్ ఘ‌ట‌న క‌న్నా ప‌ది రెట్లు ఎక్కువ‌గా ఉండేదని యుక్రెయిన్ విదేశాంగ మ‌త్రి డిమిట్రో కులేబా తెలిపారు.

Topless protesters march on Russian embassy against Putin's brutal Ukraine invasion

Topless protesters march on Russian embassy against Putin’s brutal Ukraine invasion

రష్యా సేనలకు దీటుగా బ‌దులిస్తున్నామ‌ని యుక్రెయిన్ సాయుధ బ‌ల‌గాలు స్ప‌ష్టం చేశాయి. ఇప్ప‌టివ‌ర‌కూ 250 ర‌ష్య‌న్ ట్యాంకుల‌ను ధ్వంసం చేశామ‌ని, 10వేల మంది ర‌ష్య‌న్ సైనికుల‌ను మ‌ట్టుబెట్టామ‌ని యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది.

Russia Military : సైన్యంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే 15ఏళ్ల జైలు శిక్ష, రష్యా కొత్త చట్టం

ర‌ష్యా వైపు భారీ న‌ష్టం వాటిల్లింద‌ని.. 33 విమానాలు, 37 ర‌ష్య‌న్ హెలికాఫ్ట‌ర్ల‌ను కూల్చామ‌ని తెలిపింది. 939 సాయుధ క్యారియ‌ర్ల‌ను ధ్వంసం చేశామ‌ని, 60 ఫ్యూయ‌ల్ ట్యాంకుల‌ను పేల్చివేశామ‌ని, 18 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్‌ను ధ్వంసం చేశామ‌ంది. ఇక జ‌పోరిజియా అణుశ‌క్తి కేంద్రాన్ని ర‌ష్యా దళాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.