Russia ukraine war : ‘బలి చేయటానికే ట్రైనింగ్‌లో ఉన్న మమ్మల్ని యుద్ధానికి పంపారు’ రష్యా సైనికుల ఆవేదన

‘మమ్మల్ని బలి చేయటానికే ట్రైనింగ్ లో ఉన్న మమ్మల్ని యుద్ధానికి పంపారు’ అని రష్యా సైనికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Russia ukraine war : ‘బలి చేయటానికే ట్రైనింగ్‌లో ఉన్న మమ్మల్ని యుద్ధానికి పంపారు’ రష్యా సైనికుల ఆవేదన

Russia Ukraine War Feeding Food

Russia ukraine war : యుద్ధం అంటే ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోవటమో..లేక ఆధిపత్యం చెలాయింటం కాదు. యుద్ధం అంటే ప్రాణాల్ని కోల్పోవటం. దేశం ఏదైనా ప్రాణాలు కోల్పోయేది మనుషులే. కానీ ఏదేశంలో ఎంతమంది చనిపోయారు? అనే లెక్కలు మానేసి ‘ఎంతమంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు’అనే మాట మాత్రం వినిపించదు. ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ల మధ్య జరిగే యుద్ధంలోకూడా అదే జరుగుతోంది. యుక్రెయిన్ కు సంబంధించిన సైనికులను ఇంతమందిని చంపాం అని రష్యా చెబుతుంటే..రష్యాకు చెందిన సైనికులను ఇంతమందిని తుద ముట్టించాం అని యుక్రెయిన్ చెబుతోంది. చనిపోయిన ప్రతీ సైనికుడికి ప్రతీ పౌరుడికి ఓ కుటుంబం ఉంటుంది. ఎన్నో బంధాలుంటాయి. కానీ అవేవీ ఈ యుద్ధంలో కనిపించవు..వినిపించవు. కేవలం చంపుకోవటాలు..ఆధిపత్యం కోసం పోరాటాలు తప్ప యుద్ధంలో ఇంకేమి ఉండవు.

Also read : Indian Student: బుల్లెట్ల వర్షంలో రెండు సార్లు గాయపడ్డా..- యుక్రెయిన్ స్టూడెంట్

యుద్ధం చేయటం వచ్చినా రాకపోయినా..యుద్ధం చేసిన అనుభవం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఆదేశించింది అంటే యుద్ధంలోకి దిగాల్సిందే. రణరంగంలోకి దిగాక చంపటమో లేక చావటమో ఏదోకటి జరగాల్సిందే. అక్కడ సైనికుడు ఇష్టాలు అయిష్టాలతో పని ఉండదు. తమదేశంకానివాడిని చంపాలి అంతే.లేక వారి చేతిలో చావాలి. అదే జరుగుతోంది రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో. రష్యా సైనికులకు యుక్రెయిన్ సైనికులంటే ప్రత్యేకించి ఎటువంటి శతృత్వం లేదు. కానీ తమ దేశం ఆదేశం మేరకు చంపాలి లేక చావాలి. అంటే విజయమో వీర స్వర్గమో అనే రెండు మాత్రమే ఉంటాయక్క. అదే చేస్తున్నారు అటు రష్యా సైనికులైనా ఇటు యుక్రెయిన్ సైనికులైనా..

ఇదిలా ఉంటే..యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బంధీలుగా పట్టుబడ్డ రష్యన్ బలగాలను యుక్రెయిన్ బలగాలు కెమెరాలు ఎదురుగా ఇంటర్వ్యూ చేశాయి. ఈ ఇంటర్వ్యూలో హృదయవిదారకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also read :Russia-ukraine War : యుక్రెయిన్​పై రష్యా 480 క్షిప‌ణులు​ ప్రయోగించిందని వెల్ల‌డించిన అమెరికా

‘తమను ఫిరంగి గుండ్లకు బలి ఇచ్చేందుకే టైనింగ్ లో ఉన్న మమ్మల్ని యుక్రెయిన్ యుద్ధానికి పంపారు’ అని బంధీలుగా చిక్కిన రష్యా సైనికులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఓ యువ సైనికుడు మాట్లాడుతూ, ‘నేను చావడానికే ఇక్కడకు పంపారు. ఐ లవ్యూ అమ్మా’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. సైనిక శిక్షణలో ఉన్న తమకు అబద్ధాలు చెప్పి ఇక్కడకు తీసుకొచ్చారని తెలిపాడు. యుద్ధంలో తమను ముందు వరుసలో నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తామెవరమూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, తమ యూనిట్ లో ఉన్న అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లాలనుకుంటున్నామని, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ వీడియోలను ఉక్రెయిన్ సోషల్ మీడియాలో పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also read :Russia ukraine war : తొమ్మిది రోజుల్లో 9,166మంది రష్యా సైనికుల్ని అంతమొందించాం : యుక్రెయిన్

ఇదిలా ఉంటే యుక్రెయిన్ కు బంధీలైన రష్యా సైనికులకు యుక్రెయిన్ మహిళలు ఆహారం పెడుతు..వారి తల్లితో మాట్లాడటానికి వీడియో కాల్ చేయటానికి అనుమతి ఇచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ యువ సైనికుడు తల్లితో వీడియో కాల్ లో మాట్లాడుతు కన్నీరు పెట్టుకున్న వీడియోలు వైరల్అవుతున్నాయి.