Indian Student: బుల్లెట్ల వర్షంలో రెండు సార్లు గాయపడ్డా..- యుక్రెయిన్ స్టూడెంట్

యుక్రెయిన్ రాజధాని నుంచి పారిపోయేందుకు యత్నించిన ఇండియన్ స్టూడెంట్ కు రెండు సార్లు బుల్లెట్ గాయాలు కావడంతో Kyiv హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. భుజంలోకి, కాలిలోకి బుల్లెట్ .....

Indian Student: బుల్లెట్ల వర్షంలో రెండు సార్లు గాయపడ్డా..- యుక్రెయిన్ స్టూడెంట్

Ukraine Subhan 10tvct

Indian Student: యుక్రెయిన్ రాజధాని నుంచి పారిపోయేందుకు యత్నించిన ఇండియన్ స్టూడెంట్ కు రెండు సార్లు బుల్లెట్ గాయాలు కావడంతో Kyiv హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. భుజంలోకి, కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో కదలలేని స్థితిలో ఉండిపోయాడు.

‘వాళ్లు నా ఛాతిలో నుంచి బుల్లెట్ తీశారు. నా కాలికి గాయం అయింది’ అని ఇండియా టీవీతో మాట్లాడుతూ హర్జోత్ బాధను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం యుక్రెయిన్ రాజధాని Kyivహాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఘటనను వివరించాడు. మిగిలిన స్టూడెంట్ గురించి అడిగితే వాళ్ల గురించి తనకు ఎటువంటి క్లారిటీ లేదని, వెళ్లారా రిటర్న్ అయి ఇక్కడే ఉండిపోయారా అనేది తెలియదని చెప్తున్నాడు హర్జోత్ సింగ్.

ఈ ఉదయం విదేశాంగ మంత్రిత్వ శాఖ జనరల్ వీకే సింగ్.. వీలైనంత వరకూ ఏ నష్టం జరగకుండానే యుక్రెయిన్ లోని స్టూడెంట్లను తీసుకొస్తామని మాటిచ్చారు. ముందుగా ప్రతి ఒక్కరూ Kyiv వదిలిపెట్టేయాలని ఇండియన్ ఎంబస్సీ సూచించిందని గుర్తు చేశారు. యుద్ధంలో బుల్లెట్ కు ఏ దేశం వారు.. ఏ మతం వారనే సంగతి తెలియదని వివరించారు.

Read Also : రష్యా-యుక్రెయిన్ కాల్పుల్లో భారత విద్యార్థికి గాయాలు.. కీవ్ ఆస్పత్రికి తరలింపు!

మార్చి 1న యుక్రెయిన్ లో చదువుకోవడానికి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్ రష్యా చేసిన దాడులకు మృతి చెందాడు. నవీన్ శేఖరప్ప అనే కర్ణాటకకు చెందిన వ్యక్తి ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదివేవాడు.

ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ గంగను చేపట్టారు. ఈ ఆపరేషన్ గంగలో భాగంగానే స్వయంగా భారతీయుల తరలింపు బాధ్యతలను పర్యవేక్షించేందుకు నలుగురు కేంద్ర మంత్రులు యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 17 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.