Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ కాల్పుల్లో భారత విద్యార్థికి గాయాలు.. కీవ్ ఆస్పత్రికి తరలింపు!

Russia-Ukraine War : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరుదేశాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వారానికి పైగా రష్యా-యుక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతోంది.

Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ కాల్పుల్లో భారత విద్యార్థికి గాయాలు.. కీవ్ ఆస్పత్రికి తరలింపు!

Russia Ukraine Crisis Live Updates Indian Student Reportedly Shot At In Kyiv, Train Station In Kharkiv

Russia-Ukraine War : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరుదేశాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వారానికి పైగా రష్యా-యుక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతోంది. యక్రెయిన్ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో రష్యా దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్ కీవ్ నగరంపై రష్యా సేనలు దండెత్తి రాకెట్లతో కాల్పులు జరుపుతున్నాయి.

కీవ్ నగరంపై పట్టు సాధించేందుకు రష్యా దాడుల వేగాన్ని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ లో పలు భవనాలను ధ్వంసం చేసింది. రష్యా దాడులతో కీవ్ సిటీ వణికిపోతోంది. కీవ్ నగరంపై కొనసాగుతున్న రష్యా, యుక్రెయిన్ పరస్పరం కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ కాల్పుల్లో అదే ప్రాంతంలో ఉన్న భారతీయ విద్యార్థికి ప్రమాదవశాత్తూ తూటా తగిలింది.

తీవ్రగాయలైన ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కివ్ లోని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యుద్ధం జరిగే ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని, ఆ ప్రాంతాన్ని అందరూ విడిచివెళ్లాలని ఇప్పటికే భారతీయ రాయబారి కార్యాలయం హెచ్చరించింది.

ఇప్పటికే రష్యా దాడుల్లో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని పౌర విమానయాశ శాఖ సహాయ మంత్రి జనరల్​వీకే సింగ్ వెల్లడించారు. కీవ్ నగరంలో భారతీయ విద్యార్థికి కాల్పుల్లో బుల్లెట్ తగలడంపై కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందించారు. ఆ విద్యార్థిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.

Russia Ukraine Crisis Live Updates Indian Student Reportedly Shot At In Kyiv, Train Station In Kharkiv (1)

Russia Ukraine Crisis Live Updates Indian Student Reportedly Shot At In Kyiv, Train Station In Kharkiv

Russia-Ukraine War : కీవ్ విడిచి వెళ్లండి  : భారతీయ ఎంబసీ
కీవ్ లో ఉన్న భారతీయులు వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాని సూచించినట్టు భారతీయ రాయబార కార్యాయలం ఒక ప్రకటనలో వెల్లడించింది. యుద్ధం జరిగే సమయంలో ఎవరూ కనిపించినా వాళ్లు ఎవరూ అనేది చూడరని వీకే సింగ్​ తెలిపారు. యుక్రెయిన్ గగనతలం మూసివేసింది. ఈ క్రమంలో సరిహద్దు దేశాల నుంచి భారతీయ విద్యార్ధులను తరలిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ గంగను చేపట్టారు. ఈ ఆపరేషన్ గంగలో భాగంగానే స్వయంగా భారతీయుల తరలింపు బాధ్యతలను పర్యవేక్షించేందుకు నలుగురు కేంద్ర మంత్రులు యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 17 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇప్పటికే యుక్రెయిన్ వదిలిపెట్టిన భారతీయ పౌరులు రిహద్దు దేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడి నుంచి స్వదేశానికి చేరుకుంటున్నారు యుక్రెయిన్‌లో జపోరిజ్జియా అణు పవర్​ప్లాంట్​పై రష్యా దాడి చేసిన సంగతి తెలిసందే. రష్యా దాడిలో అణు కేంద్రానికి సంబంధించిన కీలకమైన సామగ్రికి ఎలాంటి హాని జరగలేదని యుక్రెయిన్ వెల్లడించింది.

అణు పవర్ ప్లాంట్ నుంచి రాబోయే పెను ప్రమాదాన్ని తప్పించేందుకు ప్లాంట్​ అధికారులు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇటీవల రష్యా దాడుల్లో కర్ణాటకకు చెందిన విద్యార్ది మరణించడంతో ఆందోళన రేకిత్తిస్తోంది. రష్యా కాల్పుల్లో మరో విద్యార్దికి బలి కావడంతో స్వదేశానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తన్న విద్యార్థుల్లో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అందరిని స్వదేశానికి తరలిస్తామని కేంద్రం హామీ ఇస్తోంది.

Read Also : Russia-ukraine war : యుక్రెయిన్ పై యుద్ధం అంతా నేను ప్లాన్ చేసినట్లే జరుగుతోంది..టార్గెట్స్ రీచ్ అయ్యాం : పుతిన్