Russia-ukraine war : యుక్రెయిన్ పై యుద్ధం అంతా నేను ప్లాన్ చేసినట్లే జరుగుతోంది..టార్గెట్స్ రీచ్ అయ్యాం : పుతిన్

యుక్రెయిన్ పై యుద్ధం అంతా నేను ప్లాన్ చేసినట్లే జరుగుతోంది అని ప్లాన్ లో భాగంగా యుక్రెయిన్ లో టార్గెట్స్ రీచ్ అవ్వటంలో సఫలమయ్యాం అని రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతృప్తి వ్యక్తంచేశారు.

Russia-ukraine war : యుక్రెయిన్ పై యుద్ధం అంతా నేను ప్లాన్ చేసినట్లే జరుగుతోంది..టార్గెట్స్ రీచ్ అయ్యాం :  పుతిన్

Russia Ukraine War

Russia-ukraine war : యుక్రెయిన్ పై యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి శుక్రవారం (మార్చి 4,2022)నాటికి ఎనిమిది రోజులు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా పుతిన్ యుక్రెయిన్ పై యుద్ధం విషయంలో పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ‘‘యుక్రెయిన్ పై యుద్ధం అంతా నేను ప్లాన్ చేసినట్లే జరుగుతోంది..ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యాలను సాధించామని యుక్రెయిన్ లో ఇప్పటికే పలు కీలక నగరాలపై పట్టు సాధించాం’అని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పుతిన్ ప్రకటించారు.

ఈ క్రమంలో యుక్రెయిన్ పై యుద్ధం విషయంలో రష్యాపై అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా పుతిన్ మాత్రం ఏంమాత్రం తగ్గేదేలేదు అన్నట్లుగా తొమ్మిదోరోజు కూడా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో అమెరికా ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ క్రమంలో రష్యాకు అమెరికా మరో ఆఫర్ ఇచ్చింది. యుక్రెయిన్ పై యుద్ధం ఆపివేస్తే రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు అన్ని పూర్తిగా తొలగిస్తాం అని ప్రకటించింది. అయినా రష్యా మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు. తొమ్మిదోరోజు కూడా తన దాడుల్ని కొనసాగిస్తునే ఉంది.

Also read : Russia Ukraine War: రష్యాను అడ్డుకోవడానికి యుక్రెయిన్ కొత్త ప్లాన్..!

దీంట్లో భాగంగానే..రష్యా దాడుల తర్వాత యుక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో యుక్రెయిన్ ప్రమాద హెచ్చరికలను జారీచేసింది. అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు ముప్పు ఏర్పడనుందని ఆందోళన వ్యక్తి చేస్తోంది. దీంట్లో భాగంగా తాజాగా ఐరోపాలోనే అతిపెద్దది..యుక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ రష్యా దళాల దాడి తర్వాత శుక్రవారం (మార్చి 4,2022) తెల్లవారుజామున మంటలు చెలరేగాయని సమీప నగర మేయర్ ఎనర్‌గోదర్ తెలిపారు.

రష్యా దండయాత్ర..యుక్రెయిన్ ప్రతిఘటన కొనసాగుతునే ఉంది. తొమ్మిది రోజులుగా సాగుతున్న భీకర పోరులో రష్యా పలు సిటీలను ఆక్రమించినా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్, రెండో అతిపెద్ద సిటీ ఖార్కివ్‌‌‌‌ లను తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. అనుకున్న లక్ష్యం సాధించటానికి తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది. మరోపక్క యుక్రెయిన్ కూడా ఏ మాత్రం పట్టు వదలకుండా రష్యాపై పోరాడుతునే ఉంది.

Also read : Ukraine Nuclear Plants : అణుయుద్ధం ప్రమాదపు అంచులో యుక్రెయిన్.. పేలితే భారీ వినాశనమే..!

స్థానిక పరిస్థితులను అనువుగా చేసుకుని ప్రత్యర్థిని గట్టిగా దెబ్బతీస్తోంది. ఎలా అయినా తన పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్న రష్యా తన దాడిని మరింత తీవ్రం చేసింది. మిసైళ్ల వర్షం కురిపిస్తూ.. విధ్వంసానికి దిగుతోంది. అయితే ఎంత మంది, ఎన్ని ఆయుధాలతో వచ్చినా తమను ఓడించలేరని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఉక్రెయిన్‌‌‌‌ డీమిలిటరైజ్ చేసి తీరుతామని పుతిన్ స్పష్టం చేస్తున్నారు. ఈ భీకర పోరు మధ్యనే ఆ యుద్ధ భూమి నుంచి మన పౌరులను స్వదేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం తన ఆపరేషన్ ను మరింత స్పీడ్ పెంచింది.

Also read : Nuclear Power Plant : రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. యుక్రెయిన్ హెచ్చరిక!

కమర్షియల్ ఫ్లైట్స్ తో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. ఇప్పటికే ఆరున్నర వేల మందిని ఇండియాకు చేర్చగా.. రానున్న రెండ్రోజుల్లో మరో 7,400 మందిని తీసుకురానున్నట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరో వైపు గురువారం రాత్రి రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన రెండో దఫా శాంతి చర్చలు కాస్త సానుకూలంగా సాగాయి. ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు స్వస్థలాలకు వెళ్లేందుకు హ్యుమానిటేరియన్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. వారు వెళ్లిపోయే వరకూ తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించేందుకు ఓకే చెప్పాయి. దీంతో అక్కడ చిక్కుకున్న వారి తరలింపు మరింత సులభంగా, వేగంగా సాగనుంది.