Russia ukraine war : తొమ్మిది రోజుల్లో 9,166మంది రష్యా సైనికుల్ని అంతమొందించాం : యుక్రెయిన్

తొమ్మిది రోజుల్లో 9,166మంది రష్యా సైనికుల్ని అంతమొందించాం అని యుక్రెయిన్ వెల్లడించింది.

Russia ukraine war : తొమ్మిది రోజుల్లో 9,166మంది రష్యా సైనికుల్ని అంతమొందించాం : యుక్రెయిన్

Ukraine Says Russia Lost 9,166 Military Personnel In War

Updated On : March 4, 2022 / 1:34 PM IST

Ukraine Says Russia Lost 9,166 Military యుక్రెయిన్ పై రష్యా తొమ్మిదో రోజు కూడా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ యుద్ధంలో యుక్రెయిన్ తో పాటు రష్యా కూడా తీవ్రంగా నష్టపోతోంది. అటు సైనికుల పరంగా ఇటు ఆయుధాల పరంగా నష్టాన్ని చవిచూస్తోంది రష్యా. అయినా తాను అనుకున్నది సాధించేవరకు యుద్ధాన్ని ఆపేదిలేదని తెగేసి చెబుతున్నారు రష్యా అధినేత పుతిన్. ఈక్రమంలో తొమ్మిది రోజుల్లో 9వేల 166మంది రష్యా సైనికుల్ని అంతమొందించామని యుక్రెయిన్ అధికారికంగా వెల్లడించిది. రష్యాకు ధీటుగా సమాధానమిస్తున్న యుక్రెయిన్ ఇప్పటికే పలు రష్యా వాహనాలకు ధ్వంసం చేసింది.

also read : Russia-Ukraine War : యుక్రెయిన్ లోని యూరప్ లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్న రష్యా..

తొమ్మిది రోజుల్లో 9వేల 166మంది రష్యా సైనికుల్ని అంతమొందించామని వెల్లడించిన యుక్రెయిన్ రష్యాకు చెందిన 33విమానాలను కూడా ధ్వంసం చేసింది. అంతేకాదు రష్యాకు చెందిన 37 హెలికాప్టర్లు, 2 బోట్లు,60 ఇంధన ట్యాంకులు, 404 కార్లు, 251 ట్యాంకులను ధ్వంసం చేశామని వెల్లడించింది.

యుక్రెయిన్‌ను వ‌శం చేసుకోవాల‌న్న క‌సితో సాగుతున్న ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా తాజాగా శుక్రవారం (మార్చి 4,2022) యుక్రెయిన్ లోని యూరప్ లోనే అతి పెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అయిన జప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకుంది.

also read : Russia Soldiers : 6 రోజుల్లో 6వేల మంది సైనికులు మృతి.. రష్యాకు భారీ నష్టం

రాకెట్లతో దాడులు చేసి మరీ ప్లాంట్ ను స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్ కు ఇక పాశ్చాత్య దేశాల‌న్నీ ఆ దేశానికి అండ‌గా నిలుస్తున్నా పుతిన్ మాత్రం ఖాతరు చేయటంలేదు.  అవసరమైతే యుక్రెయిన్‌పై అణుబాంబుతో విరుచుకుప‌డ‌పడేందుకు కూడా పుతిన్ వెనకాడేలా లేరు అనే చర్చ నడుస్తోంది.