Russia-ukraine War : యుక్రెయిన్​పై 480 క్షిప‌ణులతో విరుచుకుపడిన రష్యా..!

యుక్రెయిన్​పై రష్యా 480 క్షిప‌ణులు​ ప్రయోగించిందని అమెరికా వెల్ల‌డించింది.

Russia-ukraine War : యుక్రెయిన్​పై 480 క్షిప‌ణులతో విరుచుకుపడిన రష్యా..!

Russia Ukraine War (1)

Russia attacks in ukraine : ఉక్రెయిన్​పై అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్న రష్యా ఇప్పటి వరకు యుక్రెయిన పై మొత్తం 480 క్షిప‌ణులు​ ప్రయోగించింది అని అమెరికా వెల్లడించింది. 230 క్షిప‌ణుల‌ను ఉక్రెయిన్లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా ప్ర‌యోగించిందని వెల్లడించింది. యుక్రెయిన్ పై పట్టు సాధిస్తున్న ర‌ష్యా రోజు రోజుకు దాడులు తీవ్ర‌త‌రం చేస్తోంది. శుక్రవారం (మార్చి 4,2022)కు యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి తొమ్మిదిరోజులు అవుతోంది.

యుక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి ముందస్తుగానే అన్ని ర‌కాలుగా ప్ర‌ణాళిక‌లు వేసుకున్న రష్యా పక్కా ప్లాన్ తో దాడులు కొనసాగిస్తోంది. ఈక్రమంలో రష్యా అధ్యక్షడు పుతిన్ ఆదేశాల మేరకు సైన్యం దాడులు చేస్తోంది. పుతిన్ ఆదేశాల మేరకు రష్యా అమెరికా క్షిప‌ణులనూ భారీ మొత్తంలో ప్ర‌యోగిస్తోంది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 470 క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

వాటిలో 230 ఉక్రెయిన్లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా, 150 రష్యా భూభాగం నుంచి, 70 బెలారస్ నుంచి, మ‌రికొన్నింటిని నల్ల సముద్రంలోని నౌకల ద్వారా ర‌ష్యా ప్రయోగించినట్లు తెలిపింది. వాటిని యుక్రెయిన్ లోని క్షిపణి విధ్వంసక దళాలు ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేశాయ‌ని చెప్పింది. ర‌ష్యా సేన‌లు ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో దాడుల‌కు తెగ‌బ‌డుతూ దూసుకుపోతున్న‌ప్ప‌టికీ ఉత్తర ప్రాంతంలో మాత్రం ఎదురు దెబ్బ‌లు తింటున్నార‌ని అమెరికా తెలిపింది. ఆ ప్రాంతంలో యుక్రెయిన్ సేన‌లు బ‌లంగా ఉండ‌డంతో ప్రతిఘటన ఎదుర‌వుతోంద‌ని వివ‌రించింది.