Volodymyr Zelensky : నాతో కూర్చోండి.. నేరుగా చర్చించుకుందాం.. నిన్నేమి చేయనులే.. పుతిన్‌కు జెలెన్స్కీ చురకలు
యుక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. యుక్రెయిన్ ప్రధాన నగరమైన కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా సైన్యం ప్రయత్నిస్తోంది.

Sit Down With Me Ukraine President Calls For Direct Talks With Putin (3)
Volodymyr Zelensky : యుక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. యుక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్ సహా ఇతర ప్రాంతాలను ఆక్రమించేందుకు రష్యా సైన్యం లోపలికి దూసుకొస్తోంది. బాంబులు, క్షిపణులతో ఏకధాటిగా దాడులకు యుక్రెయిన్‌పై రష్యా తెగబడుతోంది. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై 9 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇరుదేశాల మధ్య సయోధ్య కుదరలేదు. రష్యా, యుక్రెయిన్ల మధ్య పలుమార్లు శాంతిచర్చలు జరిగినప్పటికీ విఫలమయ్యాయి.
ఈ యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దాం.. శాంతియుతంగా చర్చించుకుందాం రండి అని జెలెన్ స్కీ పిలుపునిచ్చినా పుతిన్ ససేమిరా అంటున్నారు. తమ డిమాండ్లకు లొంగిపోతే తప్ప యుద్ధానికి వెనక్కి తగ్గేది లే అంటున్నారు పుతిన్. డిమాండ్లకు తలొగ్గితేనే నేరుగా చర్చలకు సిద్ధమనే సంకేతాలను పంపిస్తున్నారు పుతిన్. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం.. ఇక ఆపేద్దాం.. ఈ మారణహోమాన్ని.. ఇప్పటికే చాలామంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందలాది సైన్యాన్ని కోల్పోతున్నాము.. శాంతియుతంగా చర్చించుకుంటనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Sit Down With Me Ukraine President Calls For Direct Talks With Putin
Volodymyr Zelensky : 30 మీటర్ల దూరంలో కూర్చుంటే పరిష్కారం దొరకదు..
ఈ క్రమంలోనే పుతిన్ తో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. ‘పుతిన్ రండి.. నాతో కూర్చొండి.. మనమిద్దరం కలిసి కూర్చొని చర్చించుకుందాం.. మన దేశాల మధ్య వివాదాన్ని మనమే పరిష్కరించుకుందాం.. మీరు అక్కడ నేను ఇక్కడ ఇలా 30 మీటర్ల దూరంలో కూర్చొని ఉంటే సమస్య పరిష్కారం కాదు. అయినా నేను నిన్నేమి చేయనులే.. భయపడకండి’ అంటూ జెలెన్ స్కీ పుతిన్‌కు చురకలు అంటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ (French President Emmanuel Macron)తో పుతిన్ చర్చల సందర్భంగా వీరిద్దరూ పొడవైన టేబుల్‌కు ఇరువైపుల కూర్చోవడాన్ని ఉద్దేశించి జెలెన్ స్కీ చురకలు వేశారు. రష్యా, యుక్రెయిన్ దేశాల ప్రతినిధులు బెలారస్ సరిహద్దుల్లో రెండోసారి చర్చలు కొనసాగాయి.
ఈ నేపథ్యంలో జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల రష్యా దాడులను తీవ్రంగా ఖండించిన జెలెన్ స్కీ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో మనిషి మృగంలా ప్రవర్తిస్తాడని ఎవరూ అనుకోలేదన్నారు. యుక్రెయిన్‌పై పుతిన్ ఫిబ్రవరి 24న దండయాత్రకు పిలుపునిచ్చారు. యుక్రెయిన్ లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పుతిన్ దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ రష్యా మాత్రం కొట్టిపారేస్తోంది. ఉత్తర చెర్నిహివ్‌లోని పాఠశాలను రష్యా విమానాలు ఢీకొన్నాయని, తొమ్మిది మంది మరణించారని యుక్రెయిన్ వెల్లించింది. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 350 మందికి పైగా పౌరులు మరణించారని నివేదిక వెల్లడించింది.
Read Also : Zelensky Fled : యుక్రెయిన్ వీడిన జెలెన్ స్కీ..?