Russia Ukraine War : యుక్రెయిన్‌లో నో- ఫ్లై జోన్ విధించాలి.. నాటోకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి..!

Russia Ukraine War : యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరదుధేశాల మధ్య నాల్గవ రౌండ్ శాంతి చర్చలు జరుపనుంది.

Russia Ukraine War : యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. యుక్రెయిన్, రష్యా మధ్య సయోధ్య కుదిర్చేందుకు నాల్గవ రౌండ్ శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నాయి ఇరుదేశాలు. రెండు వారాలకుపైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలనే లక్ష్యంతో నేటి (సోమవారం, మార్చి 14) చర్చలు కొనసాగనున్నాయి. ఇప్పటికే బెలారస్‌లో రెండు పక్షాల మధ్య మూడు రౌండ్ల చర్చలు ప్రధానంగా మానవతాదృక్పథంపై దృష్టి సారించాయి.

ఈ నేపథ్యంలో యుక్రెయిన్‌పై యుద్ధం వైమానిక దాడులు చేయకుండా ఉండేలా తమ దేశంపై నో-ఫ్లై జోన్‌ను విధించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)ను కోరారు. లేదంటే రష్యా రాకెట్లు నాటో భూభాగంపై పడతాయన్నారు. రష్యాను అడ్డుకోకుంటే.. పశ్చిమ దేశాలతో యుద్ధానికి దిగుతుందని జెలెన్ స్కీ హెచ్చరించారు. అంతేకాదు.. నార్డ్​ స్ట్రీమ్​2ను ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఐరాపా సమాఖ్యలో యుక్రెయిన్​ సభ్యత్వంపై చర్చల ప్రక్రియకు ప్రాధాన్యమిస్తామని ఈయూ కౌన్సిల్​ అధ్యక్షుడు చార్లెస్​ మైకెల్​ చెప్పినట్లు జెలెన్​స్కీ తెలిపారు.

ఇప్పటికే ఈ విషయమై ఆయనతో మాట్లాడినట్లు చెప్పారు. యుక్రెయిన్​కు ఆర్థిక సాయం, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు. రష్యా- ఉక్రెయిన్​ మధ్య నేడు మరో విడత శాంతి చర్చలు జరుగనున్నాయని తెలిపారు. యుక్రెయిన్​పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో మరోమారు శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి ఇరు దేశాలు. సోమవారం ఉదయం 10.30 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు చేపట్టనున్నట్లు స్పుత్నిక్​ మీడియా తెలిపింది. ఈ చర్చలకు సంబంధించి యుక్రెయిన్​ ప్రతినిధులు సైతం ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

Russia Ukraine War Zelenskyy Urges Nato To Impose No Fly Zone Over Ukraine

NATO సభ్యులైన పోలాండ్‌కు సరిహద్దుకు సమీపంలోని సైనిక శిక్షణా మైదానంలో రష్యన్ దళాలు వైమానిక దాడులు ప్రారంభించినప్పుడు 35 మంది మరణించారు. మరో 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజున జెలెన్ స్కీ ప్రస్తావించారు. నివారణ ఆంక్షలు లేకుండా రష్యా యుద్ధాన్ని ప్రారంభిస్తుందని, మాస్కో నార్డ్ స్ట్రీమ్ 2ను ఆయుధంగా ఉపయోగిస్తుందని తాను ఇప్పటికే నాటోను హెచ్చరించానని యుక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. పశ్చిమ యుక్రెయిన్‌లోని యావోరివ్ సైనిక శిక్షణా మైదానంలో క్షిపణి దాడిలో 180 మంది విదేశీ సైనికులను చంపినట్లు రష్యా గతంలో పేర్కొంది.

ఇదిలా ఉండగా.. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్‌తో జరిగిన చర్చలో యుక్రెయిన్ EU సభ్యత్వంపై తదుపరి చర్చల ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు జెలెన్ స్కీ తెలిపారు. సాధారణ అంతర్జాతీయ చర్చలు… కౌన్సిల్ ప్రెసిడెంట్ @eucopresident తో దురాక్రమణదారుపై ఆర్థిక మద్దతు ఆంక్షల ఒత్తిడిని పెంచడంపై చర్చించినట్టు తెలిపారు

Read Also : NATO Refuse : యుక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న జెలెన్‌స్కీ.. నో చెప్పిన నాటో

ట్రెండింగ్ వార్తలు