Russia Ukrainian War How Many Ukrainians And Russians Have Died In Putin’s War
Russia-Ukrainian War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర రెండు వారాలకుపైగా కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ పై రష్యా బలగాలు విచక్షణ లేకుండా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. యుక్రెయిన్ ప్రధాన నగరాల్లోకి చొచ్చుకుని వచ్చిన రష్యా బలగాలు.. ఇప్పటికే ఖర్కివ్, మారియుపోల్, సుమీ, చెర్నిహివ్ వంటి ఇతర నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అలాగే ఖేర్సన్ ప్రాంతంపై రష్యా పూర్తి నియంత్రణలో తీసుకుంది. యుక్రేనియన్ రాజధాని కైవ్‌పై రష్యా వరుసగా బాంబు దాడులను చేస్తూనే ఉంది. రష్యా దాడుల నేపథ్యంలో యుక్రెయిన్ నుంచి మూడు మిలియన్ల మందికి పైగా ప్రజలు దేశం విడిచి పారిపోయారు.
ఐక్యరాజ్యసమితి (UN) నివేదిక ప్రకారం.. మూడు మిలియన్ల శరణార్థులు ఉన్నారని అంచనా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ తీవ్రంగా వ్యతిరేకించారు. యుక్రెయిన్ సైన్యంతో పాటు దేశ ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ జెలెన్ స్కీ రష్యాతో పోరాడుతున్నారు. ఇప్పటికైనా రష్యా యుక్రెయిన్‌లో సాగిస్తున్న మారణహోమాలను ఆపాలంటూ ప్రపంచదేశాలు సహా అంతర్జాతీయ న్యాయస్థానం కూడా పుతిన్ ఆదేశించింది. అయినప్పటికీ పుతిన్ ఎవరు మాట వినని మోనార్క్ మాదిరిగా యుక్రెయిన్ పౌరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. యుక్రెయిన్ సైనికులతో మొదలైన దాడులు.. కీవ్ నగరంలోని జనావాసాలపై కూడా రష్యా సైన్యం విరుచుకుపడుతోంది.
అమెరికా సైనికుల సంఖ్య కన్నా యుక్రెయిన్‌లోనే అత్యధికం :
రష్యా మొదలుపెట్టిన యుద్ధంలో ఇప్పటివరకూ ఇరుదేశాల సైనికులు, పౌరులు భారీ సంఖ్యలో మరణించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి.. యుక్రెయిన్‌పై పుతిన్ మొదలుపెట్టిన ఈ మారణహోమంలో యుక్రెయిన్ పౌరులు, సైనికులతో పాటు రష్యాకు చెందిన సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్‌లో 7,000 మంది రష్యన్ సైనికులు మరణించగా.. 14,000 మంది గాయపడ్డారు. అమెరికా అధికారుల తాజా అంచనాల ప్రకారం.. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో 20 ఏళ్ల క్రితం యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య కన్నా యుక్రెయిన్‌లోనే అత్యధికం.
యుక్రెయిన్‌తో యుద్ధంలో 498 మంది రష్యన్ సైనికులు మరణించగా.. 1,597 మంది గాయపడ్డారని రష్యా మార్చి 2న ఒక ప్రకటనలో వెల్లడించింది. 2,870 మంది యుక్రెయిన్ సైనికులు మరణించగా.. 3,700 మంది గాయపడ్డారు.. మరో 572 మంది బందీలుగా మారినట్టు రష్యా పేర్కొంది. మరోవైపు.. అమెరికా-ఆధిపత్య సైనిక కూటమి నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)తో బాహ్యంగా మద్దతు కలిగిన యుక్రెయిన్.. మార్చి 12 నాటికి కేవలం 1,300 మంది సైనికులు మాత్రమే చంపినట్టు పేర్కొంది. డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రకారం.. యుక్రెయిన్‌లో స్వయం ప్రకటిత, రష్యా మద్దతుతో విడిపోయిన రాష్ట్రంలో మార్చి 11 నాటికి ఒక డాన్‌బాస్ ప్రాంతంలోనే 979 మంది యుక్రేనియన్ సైనికులు మరణించారు. మరో 1,134 మంది గాయపడ్డారు.
Russia Ukrainian War How Many Ukrainians And Russians Have Died In Putin’s War
వాస్తవ గణాంకాలే ఎక్కువ :
అమెరికా అధికారి అంచనా ప్రకారం… రష్యా, యుక్రెయిన్ దాడుల్లో 13,800 మంది రష్యన్ సైనికులు మరణించారు. మరో 600 మంది పట్టుబడ్డారు. యుక్రెయిన్‌లో రష్యా మిలిటరీని దీటుగా ఎదుర్కొనేందుకు మార్చి 16న జెలెన్స్కీకి సైనిక మానవతా సాయంతో పాటు పశ్చిమ దేశాలు నిధులు కురిపించాయి. యుక్రెయిన్ నాటో సభ్యుడు కాదు.. అయినప్పటికీ రష్యాతో యుద్ధాన్ని నివారించాలని నాటో దేశాలు తీవ్రంగా ప్రయత్నించాయి. UN ప్రకారం.. యుక్రెయిన్ యుద్ధంలో 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అధికారిక గణాంకాలు కన్నా వాస్తవ గణాంకాలు చాలా ఎక్కువగానే ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఒక్క మారియుపోల్, ఖార్కివ్‌లలోనే 3వేల మంది మృతిచెందినట్టు యుక్రెయిన్ వెల్లడించింది.
రష్యా శక్తివంతమైన మిలిటరీ కారణంగా యుక్రేనియన్ ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాతో యుద్ధాన్ని కొనసాగించేందుకు యుక్రెయిన్ వద్ద తగినంత మందుగుండు సామాగ్రి అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో యుక్రెయిన్ అధ్యక్షుడు ప్రపంచ దేశాలను ఆయుధాల సహాయం చేయమని కోరుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు ఆయుధాలను పంపేందుకు ముందుకు వచ్చాయి. రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో పౌరుల మరణాల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా. కానీ, యూఎన్ అధికారిక గణాంకాల సంఖ్య చాలా తక్కువగా అంచనా వేయడం జరిగింది. దీనికి కారణం యుద్ధం జరిగే సమయంలో అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎంత మంది మృతిచెందారనేది గుర్తించడం కష్టంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి.
Read Also : Russia ukraine War: ‘పుతిన్..తప్పు చేస్తున్నారు..యుద్ధాన్ని మీరే స్టార్ట్ చేశారు..మీరే ఆపాలి’