Russia ukraine War: ‘పుతిన్..తప్పు చేస్తున్నారు..యుద్ధాన్ని మీరే స్టార్ట్ చేశారు..మీరే ఆపాలి’

యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని హాలివుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్క్వార్జ‌నిగ‌ర్ పుతిన్ ను కోరారు. ‘యుద్ధం మీరే మొదలు పెట్టారు. సో మీరే ఆపాలి అని కోరారు.

Russia ukraine War: ‘పుతిన్..తప్పు చేస్తున్నారు..యుద్ధాన్ని మీరే స్టార్ట్ చేశారు..మీరే ఆపాలి’

Russia Ukraine ..stop War Say Hero Arnold schwarzenegger (1)

Russia ukraine ..Stop war say Hero Arnold Schwarzenegger : ‘యుక్రెయిన్ పై రష్యా యుద్ధం హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఆపాలని సాక్షాత్తు అంతర్జాతీయ న్యాయస్థానమే చెప్పినా ఐ డోంట్ కేర్ అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ క్రమంలో యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని హాలివుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్క్వార్జ‌నిగ‌ర్ పుతిన్ ను కోరారు. ‘యుద్ధం మీరే మొదలు పెట్టారు. సో మీరే ఆపాలి అని కోరారు. ఆ యుద్ధాన్ని మీరే ఆపాల‌ని హాలీవుడ్ హీరో అర్నాల్డ్ ష్క్వార్జ‌నిగ‌ర్ గురువారం (మార్చి 17,2022)త‌న వీడియో ద్వారా ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ను కోరారు.

యుక్రెయిన్‌లో జ‌రుగుతున్న దాడిపై పుతిన్ త‌ప్పుడు స‌మాచారాన్ని చేర‌వేస్తున్న‌ారని రష్యన్లను పుతిన్ తప్పుదారి పట్టిస్తున్నారు అని అర్నాల్డ్ ఆరోపించారు. పుతిన్ తన స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ర‌ష్యా సైనికుల ప్రాణాల‌ను బ‌లిగొంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 9 నిమిషాల వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో అర్నాల్డ్ పోస్టు చేశారు.యుక్రెయిన్ పై రష్యా అక్ర‌మ యుద్ధం చేస్తోందని..ర‌ష్యా ప్ర‌జ‌ల్ని ప్రేమిస్తాన‌ని, అందుకే నిజం చెబుతున్నాన‌ని ఆర్నాల్డ్ వీడియోలో పేర్కొన్నారు.

యుక్రెయిన్‌ను ఆక్రమించుకునే ఉద్దేశం లేదంటూనే పుతిన్‌ రూటు మార్చారు. మొన్నటి వరకూ యుక్రెయిన్‌ భద్రతా దళాలను టార్గెట్ చేసిన రష్యన్ ఆర్మీ.. ఇప్పుడు సామాన్య ప్రజలపై ప్రతాపం చూపుతోంది. అపార్ట్‌మెంట్లు, ఇండ్లపై బాంబుల వర్షం కురిపిస్తోంది. బంకర్లపై మిసైళ్లు ప్రయోగిస్తోంది. దీంతో వేలాది మంది ప్రజలు.. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తిరస్కరిస్తున్నామని రష్యా స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమై 22 రోజులైనా కూడా యుక్రెయిన్‌పై భీకర దాడికి పాల్పడుతోంది రష్యా. సామాన్య ప్రజలే టార్గెట్‌గా బాంబులు, మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. నడి వీధుల్లో ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆతృతతో చంకలో చంటి బిడ్డలనెత్తుకొని తల్లులు సరిహద్దులు దాటుతున్నారు. మాటలకందని మారణహోమానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది యుక్రెయిన్‌. కళ్ల నిండా నీళ్లు.. గుండె నిండా భారం.. తలదాచుకోవటానికి అందరికీ బంకర్లు లేక.. గోడు గోడున ఏడుస్తున్నారు అక్కడి ప్రజలు. కేవలం సైనికులు, సైనిక స్థావరాలే అంటూ దండయాత్ర మొదలుపెట్టిన రష్యా.. ఇప్పుడు సామాన్యులే టార్గెట్‌గా విరుచుకుపడుతోంది. తీరప్రాంత నగరమైన మరియుపోల్‌లోని ఒక థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగానే పౌరులపై మారణహోమానికి పాల్పడ్డాయని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.