Russia Uses Kalibr : యుక్రెయిన్‌పై పవర్‌ఫుల్ మిస్సైల్స్‌తో రష్యా దాడి.. రెండోసారి కాలిబర్ ప్రయోగం

యుక్రెయిన్‌పై పోరులో రష్యా తన అమ్ములపొదిలోని కీలక అస్త్రాలను వాడుతోంది. తాజాగా కాలిబర్‌ దీర్ఘశ్రేణి క్రూజ్‌ మిసైళ్లను ప్రయోగించింది. (Russia Uses Kalibr)

Russia Uses Kalibr

Russia Uses Kalibr : యుక్రెయిన్ పై రష్యా దాడి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రష్యా బలగాలు.. బాంబుల, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ లోని కీవ్‌, ఖార్కివ్‌, మరియుపోల్‌ వంటి నగరాలన్నీ ధ్వంసమవుతున్నాయి. అంతేకాదు… యుక్రెయిన్‌పై పోరులో రష్యా తన అమ్ములపొదిలోని కీలక అస్త్రాలను వాడటం ప్రారంభించింది. ఇప్పటికే కింజల్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణిని రెండు సార్లు వాడిన రష్యా.. తాజాగా కాలిబర్‌ దీర్ఘశ్రేణి క్రూజ్‌ మిసైళ్లను రెండోసారి ప్రయోగించింది.

గురువారం క్రిమియాలోని సెవస్టపోల్‌ వద్ద సముద్రంపై రష్యన్‌ కార్వెట్టి నుంచి దీనిని ప్రయోగించింది. రష్యా రక్షణ శాఖ దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. యుక్రెయిన్‌లోని ఒర్జెవ్‌ గ్రామంలోని సైనిక స్థావరంపై దాడి చేసినట్లు తెలిపింది. ఈ ప్రదేశం కీవ్‌కు 200 మైళ్ల దూరంలో ఉంది. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి అందిన ఆయుధాలను కూడా ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా ఈ క్షిపణులను అత్యంత కీలకమైన లక్ష్యాలపై మాత్రమే ప్రయోగిస్తుందని పశ్చిమదేశాల అధికారులు చెబుతున్నారు.(Russia Uses Kalibr)

Russia ukraine war : రష్యాతో పోరాటానికి రోజు 1000 ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికాకు జెలెన్ స్కీ డిమాండ్

కాలిబర్ మిస్సైల్ ప్రత్యేకతలు..
* గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని వెళ్లి భూమిపై ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేసేలా కాలిబర్‌ క్షిపణిని అభివృద్ధి చేశారు.
* భూమికి తక్కువ ఎత్తులో సమాంతరంగా ఇది ప్రయాణిస్తుంది.
* మార్గం మధ్యలో దీని లక్ష్యానికి సంబంధించిన మార్గాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు.
* దీనిలో దాదాపు 500 కిలోల వార్‌హెడ్‌ను అమర్చవచ్చు.(Russia Uses Kalibr)
* దీనిని గోదాములు, కమాండ్‌ పోస్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు వాడతారు.
* మార్చి నెల మొదట్లో కూడా రష్యా ఈ క్షిపణిని వాడి మైకలైవ్‌ నగరంపై దాడి చేసింది.
* నాటి దాడిలో 8 మంది మరణించారు.
* కాలిబర్‌ను అభివృద్ధి చేసిన తర్వాత 2015 అక్టోబర్‌లో సిరియాలో దీనిని ఉపయోగించింది.
* అప్పట్లో కాస్పియన్‌ సముద్రం నుంచి 26 క్షిపణులను సిరియా ప్రభుత్వ వ్యతిరేక వర్గంపై ప్రయోగించింది.

Kinzhal Hypersonic Missiles : యుక్రెయిన్‌పై రష్యా కొత్త అస్త్రం.. హైపర్ సోనిక్ మిస్సైళ్ల ప్రయోగం

కాగా, యుక్రెయిన్‌ రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి. రష్యా దాడుల్లో వేలాదిమంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అందిరినీ కలచివేస్తోంది. ఇక యుక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఎలాగైనా పట్టు సాధించేందుకు రష్యా అణు దాడి చేస్తుందా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. అణ్వాయుధాలనూ మోసుకుపోగల హైపర్‌ సోనిక్‌ క్షిపణి కింజల్‌ను కూడా యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా ప్రయోగించడంతో భయాలు రెట్టింపయ్యాయి.(Russia Uses Kalibr)

Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..

కాగా, హైపర్‌ సోనిక్‌ మిసైళ్లను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా, చైనా దగ్గర అత్యాధునిక హైపర్‌ సోనిక్‌ మిసైళ్లున్నాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. రష్యా సాయంతో కలిసి ఇండియా బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ మిసైల్‌ను తయారు చేస్తోంది. సూపర్‌ సోనిక్‌ అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగం (మాక్‌ 2 నుంచి 3)తో దూసుకెళ్లేవి. బ్రహ్మోస్‌ 2 హైపర్‌ సోనిక్‌ మిసైల్‌ను కూడా ఇండియా తయారు చేస్తోంది.