Russian Military : రష్యా మిలటరీ వాహనాలపై ‘Z’ గుర్తు ఎందుకు? దాని అర్థమేంటి?

యుక్రెయిన్ సరిహద్దుల్లో రహదారులపై రష్యా యుద్ధ వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఎక్కడ చూసినా రష్యా యుద్ధ వాహనాలే కనిపిస్తున్నాయి.

Russian Military What Does The Z Symbol On Russian Military Vehicles Mean

Russian Military Vehicles : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఇరుదేశాల మధ్య యుద్ధం నేటికి (సోమవారం) 13వ రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ పై దండెత్తిన రష్యా బలగాలు దాదాపు ఆ దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమించాయి. యుక్రెయిన్ సరిహద్దుల్లో రహదారులపై రష్యా యుద్ధ వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఎక్కడ చూసినా రష్యా యుద్ధ వాహనాలే కనిపిస్తున్నాయి.

అయితే ఆ వాహనాలను పరిశీలిస్తే.. అన్ని వాహనాలకు వెనుకవైపు Z అనే గుర్తు కనిపిస్తోంది. అది కూడా ముదురు ఆకుపచ్చ రంగులో వాహనాలు కనిపిస్తున్నాయి. ఆ వాహనాలపై తెలుపు రంగులో Z అనే గుర్తు కనిపిస్తోంది. అసలు Z అనే సింబల్ వెనుక అర్థమేంటి అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఈ అక్షరం వెనుక అసలు అర్థం ఏంటో తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

అయితే ఈ Z అంటే.. “Za pobedy” (విజయం కోసం) అని అర్థమట.. అయితే “Zapad” (పశ్చిమ)” అని కూడా పిలుస్తారు. కొద్ది రోజుల క్రితమే ఈ చిహ్నన్ని గుర్తించారు. రష్యన్ కొత్త భావజాలం జాతీయ గుర్తింపుకు చిహ్నంగా మారిందని అంటున్నారు. రష్యా నుంచి యుక్రెయిన్‌లోకి వెళ్లే వాహనాలపై మాత్రమే ఈ ‘Z’ అక్షరాలను ముద్రించారట.. ఆ గుర్తును కొందరు విజయానికి చిహ్నంగా భావిస్తారని అంటున్నారు.

Russian Military What Does The Z Symbol On Russian Military Vehicles Mean

ఈ గుర్తు కొద్దిరోజుల క్రితమే ప్రచారంలోకి వచ్చిందని చెబుతున్నారు. యుద్ధభూమిలో రష్యన్‌ సైనికులే ఒకరిపై ఒకరు దాడి చేసుకోకుండా ఉండేందుకు వీలుగా రష్యా వాహనాలపై ఈ Z అనే సింబల్ ముద్రించారట.. రష్యాలోని ఈ Z గుర్తుకు బాగా ఆదరణ లభిస్తోంది. ఈ Z అక్షరాన్ని టీ-షర్ట్‌లపై ముద్రించి ధరించి తిరుగుతున్నారు. కార్లపైనా కూడా ఈ Z గుర్తును ముద్రిస్తున్నారు.

చిహ్నాన్ని మొదటిసారి ఎప్పుడు గుర్తించారు?
“Z” చిహ్నాన్ని మొదటిసారిగా ఫిబ్రవరి 22న దొనేత్సక్ ప్రాంతంలోకి ప్రవేశించిన రష్యన్ వాహనాలపై గుర్తించారు. పదాతిదళాలను గుర్తించేందుకు ఈ చిహ్నం ఒక మార్గం కావచ్చని అంటున్నారు. 2014లో రష్యాచే విలీనం అయిన సమయంలోనూ క్రిమియాలోని వాహనాలపై కూడా ఈ “Z” గుర్తు కనిపించింది.

ఇతర చిహ్నాలు ఏంటి?
“Z” అనే సింబల్ మాత్రమే కాకుండా రష్యన్ సైనిక వాహనాలపై ఇతర చిహ్నాలు కూడా కనిపిస్తాయి. ఇరువైపులా రెండు గీతలతో కూడిన త్రిభుజం, లోపల మూడు చుక్కలతో కూడిన వృత్తం, లోపల చిన్న త్రిభుజంతో కూడిన పెద్ద త్రిభుజం కనిపిస్తుంటాయి. అయితే ఈ చిహ్నాల వెనుక అర్థం ఏంటి అనేది మాత్రం రష్యా సైనిక అధికారులు అధికారికంగా ఏమీ వెల్లడించలేదు.

Read Also : Dmitry Peskov : ఆ షరతులకు యుక్రెయిన్ అంగీకరిస్తే.. ఈ క్షణమే దాడులు ఆపేస్తాం-రష్యా

ట్రెండింగ్ వార్తలు