Russian Ukraine War : ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి దాడి.. పవర్ గ్రిడ్ మూసివేత.. రంగంలోకి నాటో యుద్ధ విమానాలు!

Russian Ukraine War : ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌లను లక్ష్యంగా రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. రంగంలోకి దిగిన నాటో దళాలు రష్యా క్షిపణులను నేలమట్టం చేశాయి.

Russian missile attack

Russian Ukraine War : ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భారీ క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది. ఉక్రెయిన్ అంతటా పెద్ద బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌లను లక్ష్యంగా రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ముఖ్యంగా గ్యాస్‌, ఎరువుల సరఫరా కేంద్రాలపైనే దాడులకు దిగింది.

మాస్కోకు చెందిన 7 టీయూ-22, 6 టీయూ-95 స్ట్రాటజిక్‌ బాంబర్లతో రష్యా దాడులకు తెగబడింది. పోలాండ్‌ సరిహద్దుకు సమీపంలోనే ఈ రష్యా క్షిపణులను ప్రయోగించింది. వెంటనే నాటో దళాలు రంగంలోకి దిగాయి. ఫైటర్‌ జెట్‌ విమానాలతో గాల్లోకి ఎగసాయి.

కొన్ని ప్రాంతాల్లో పవర్ గ్రిడ్లు మూసివేత :
నేలపై నుంచి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు కూడా అలర్ట్ అయ్యాయని నాటో ఆపరేషనల్‌ కమాండ్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ కొన్ని ప్రాంతాల్లో పవర్ గ్రిడ్‌ను మూసివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. రష్యా ప్రయోగించిన 40 క్షిపణుల్లో 30 క్షిపణులను ఉక్రెయిన్‌ ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థలు కూల్చేసాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.

రష్యా దాడులకు ధీటుగా ఎదుర్కొనేందుకు మరో 70 డ్రోన్లు కూడా రంగంలోకి దిగినట్టు తెలిపారు. నాటో సదస్సులో మిత్ర దేశాల హామీలు పూర్తి స్థాయిలో నెరవేరలేదన్నారు. ఇప్పటికే, ఎయిర్‌ డిఫెన్స్‌లను వేగవంతం చేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు జెలెన్ స్కీ తెలిపారు. రష్యా దాడి నేఫథ్యంలో ఉక్రెయిన్‌ నేషనల్‌ గ్రిడ్లలో పలు ప్రాంతాల్లో అత్యవసర కరెంటు కోతలను కూడా విధిస్తున్నారు. ముందుజాగ్రత్తగా దాడుల సమయంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది.

రష్యాపై ఉక్రెయిన్‌ దాడికి ప్రతీకారంగానే దాడులు జరిగాయని అంచనావేస్తున్నారు. దాదాపు 14 క్షిపణులు, 200 డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ మంగళవారం (జనవరి 14) విరుచుకుపడింది. రష్యాలోని విద్యుత్తు కేంద్రాలు, కెమికల్‌ ఫ్యాక్టరీలను లక్ష్యంగా దాడికి దిగింది. రెండు మిలియన్‌ డాలర్ల విలువైన స్ట్రామ్‌ షాడో క్షిపణులను ఉక్రెయిన్ కూల్చేసిందని రష్యా వెల్లడించింది.

రష్యా రాత్రిపూట 43 క్షిపణులు, 74 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. మొత్తం 30 క్షిపణులు, 47 డ్రోన్‌లను కూల్చివేయగా, 27 డ్రోన్‌లు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయని పేర్కొంది. రష్యా క్షిపణులు పోలాండ్ సమీపంలోని పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్ ప్రాంతం నుంచి రష్యా సరిహద్దులోని ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ వరకు లక్ష్యంగా చేసుకున్నాయి.

ఉక్రెయిన్ అండగా జర్మనీ :
ఉక్రెయిన్‌కు 60 అదనపు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులను జర్మనీ పంపనుంది. రష్యా దాడులకు ధీటుగా తన రక్షణను బలోపేతం చేసేందుకు జర్మనీ మరో 60 IRIS-T విమాన విధ్వంసక క్షిపణులను ఉక్రెయిన్‌కు అందజేయనుంది. కైవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, జర్మన్ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు జర్మన్ మీడియా నివేదించింది.

Read Also : Fact Check-Bill Gates : కాశీ విశ్వనాథుని సన్నిధిలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్..? ఫేక్ అంటున్న నెటిజన్లు..!