Frank
Russian Prank Star : సోషల్ మీడియాలో వినోదం అందించేందుకు వీడియోలు తీస్తూ పోస్టులు చేస్తుంటారు. తమకు తోచిన విధంగా ప్రయత్నిస్తుంటారు. ఫ్రాంక్ వీడియోలు తీస్తూ..ఆదాయం ఆర్జిస్తుంటారు. అయితే..ఈ ఫ్రాంక్ వీడియోలు బెడిసికొడుతుంటాయి. చిత్రవిచిత్రంగా ఫ్రాంక్ వీడియోలు తీసి..నెటిజన్ల ఆదరణ పొందాలని ట్రై చేస్తుంటారు.
ఈ క్రమంలో..ఫ్రాంక్ స్టార్ గా ముద్రపడిన ఓ యువకుడు..కరోనా వచ్చినట్లు యాక్టింగ్ చేస్తూ…ట్రైన్ లో కుప్పకూలిపోయాడు. అసలే కరోనా భయంతో వణికిపోతున్న జనాలు..ఇతడిని చూసి హఢలిపోయారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరీశీలించిన అధికారులు అతడికి రెండేళ్ల పాటు జైలు శిక్ష ధించింది. ఈ ఘటన రష్యాలోని మాస్కోలో చోటు చేసుకుంది.
మాస్కోలో మెట్రో రైలులో ఫ్రాంక్ స్టార్ గా గుర్తింపు పొందిన కరమతుల్లో డిహబోరోవ్ ఎక్కాడు. అప్పటికే రైలులో రద్దీగా ఉంది. రైలు మొదలైన కాసేపటికి..ఓ బోగిలోకి వెళ్లి..కరోనా వచ్చినట్లుగా..దగ్గుతూ..తుమ్ముతూ..యాక్టింగ్ చేయసాగాడు. 2020, ఫిబ్రవరిలో ఈ విధంగా చేశాడు. ఒక్కసారిగా కిందపడి గిలగిలా కొట్టుకపోవడంతో రైలులో ఉన్న వారు భయపడిపోయి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఆ దేశ పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు. డిహబోరోవ్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టు తీర్పునిచ్చింది. డిహబోరోవ్ కు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ…తీర్పును వెలువరించింది.
Когда пранк вышел из-под контроля!
В Москве задержали шутника, разыгравшего в метро приступ коронавируса. Полиция попросила Черемушкинский суд столицы арестовать молодого человека. pic.twitter.com/fmT17RUijQ
— ВЕСТИ (@vesti_news) February 10, 2020