Russia Temporary Ceasefire : యుక్రెయిన్ తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన.. తాత్కాలిక కాల్పుల విమరణ

యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

PUTIN

Russia Temporary Ceasefire : యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్ లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్ధరాత్రి 12 గంటల వరకు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ మంత్రిని పుతిన్ ఆదేశించారు.

36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 6, 7 తేదీల్లో యుక్రెయిన్ లో తాత్కాలిక కాల్పులు విరమణ పాటించనున్నారు. 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు కాల్పులకు స్వస్తి పలకనున్నారు. ప్రపంచమంతటా డిసెంబర్ 25న క్రిస్మస్ జరపగా రష్యాలో తేదీ భిన్నంగా ఉంటుంది. రష్యాతోపాటు యుక్రెయిన్ లోనూ కొంత మంది జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటారు.

Russia-ukraine war @5 months : 5 నెలలు దాటినా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం

మరోవైపు యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా చర్చల విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. యుక్రెయిన్ లో తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలు రష్యాలో అంతర్భాగమని అంగీకరిస్తే ఆ దేశంలో చర్చలకు సిద్ధమని తెలిపారు. తుర్కీ అధ్యక్షుడుతో ఫోన్ లో సంభాషణ సందర్భంగా పుతిన్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు క్రెమ్ లెన్ వెల్లడించింది.

పశ్చిమదేశాల ఆయుధాల సహాయంపై పుతిన్ మండిపడినట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ఎడోగా పిలుపునిచ్చారు. మరోవైపు పుతిన్ కాల్పుల విరమణ ప్రకటనను యుక్రెయిన్ అధ్యక్షులు జెలెన్ స్కీ తప్పుబట్టారు. అదంతా ఉట్టిదేనని స్పష్టం చేశారు. ప్రాపగండ కోసం పుతిన్ ఇలాంటి ప్రకటన చేయడాన్ని తప్పు బట్టారు.