Russian scientist : 150ఏళ్లు జీవించడం సాధ్యమే.. ఇప్పటికే అలాంటివారెందరో పుట్టారు.. రష్యా శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు

Russian scientist : మనిషి 150ఏళ్లు జీవించడం సాధ్యమేనా..? శాస్త్రవేత్తల నుంచి సాధ్యమే అనే సమాధానం వినిపిస్తోంది.

Russian scientist : 150ఏళ్లు జీవించడం సాధ్యమే.. ఇప్పటికే అలాంటివారెందరో పుట్టారు.. రష్యా శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు

Russian scientist

Updated On : October 14, 2025 / 12:20 PM IST

Russian scientist : మనిషి 150ఏళ్లు జీవించడం సాధ్యమేనా..? ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ ప్రశ్న ఆసక్తిని కలిగిస్తోంది. ఈ మేరకు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, శాస్త్రవేత్తల నుంచి 150ఏళ్లు జీవించడం సాధ్యమే అనే సమాధానం వినిపిస్తోంది. 150ఏళ్లు పైబడిన తరువాత కూడా మనిషి హాయిగా జీవించగలిగే ఔషధాల సృష్టికి ప్రయోగాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

గత నెలలో బీజింగ్‌లో జరిగిన చైనా సైనిక పరేడ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఈ అంశం చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. జీవనసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలివైపోతున్న, పొడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించొచ్చు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువునూ జయించవచ్చు అని జిన్‌పింగ్‌తో పుతిన్ వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం ఇదే అంశాన్ని రష్యా శాస్త్రవేత్త విటాలీ కోవల్యోవ్ ప్రస్తావించారు.

Also Read: Donald Trump : పాక్ ప్రధానికి బిగ్ షాకిచ్చిన ట్రంప్.. షాబాజ్ షరీఫ్ పక్కన ఉండగానే భారతదేశంపై పొగడ్తల వర్షం.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే?

విటాలీ కోవల్యోవ్ రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు. తాజాగా వైద్య, ఆరోగ్య సంబంధ విషయాలను వివరించే బయోపాలిటిక్స్ ఛానల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పలు అంశాలపై మాట్లాడారు. మానవుని వృద్దాప్యాన్ని నెమ్మదింపజేయడం 150ఏళ్లు బతికేలా చేయడమనేది సైన్స్ కాల్పనిక సాహిత్యానికే పరిమితం కాబోదని ఆయన చెప్పారు.

150ఏళ్ల వరకూ బతికే సామర్థ్యమున్న వ్యక్తులు ప్రస్తుతం మన మధ్యే ఉన్నారని, 150ఏళ్లు జీవించబోయే వారు ఇప్పటికే పుట్టి ఉండొచ్చు. వారికి ఇప్పుడు 20, 30 లేదా 40 సంవత్సరాలు ఉండొచ్చు అని ఆయన పేర్కొన్నారు.

వృద్ధాప్య ఛాయల్లోకి పడిపోవడం ఇటీవల తగ్గింది. 150ఏళ్లు జీవించడం అనేది సైన్స్ ఫిక్షన్ కానేకాదు. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే ప్రయోగాలెన్నో జరుగుతున్నాయి. వృద్ధాప్య వేగాన్ని తగ్గించడం అసాధ్యం అనేది తప్పుడు భావన. 150ఏళ్లు పైబడిన తరువాత కూడా మనిషి హాయిగా జీవించగలిగే ఔషధాల సృష్టికి ప్రయోగాలు జరుగుతున్నాయని రష్యా శాస్త్రవేత్త విటాలీ కోవల్యోవ్‌ పేర్కొన్నారు.