Cancer Vaccine: మనుషుల ప్రాణాలు తోడేసే జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. మొదటి దశలో గుర్తిస్తే తప్ప ఈ వ్యాధి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలాంటి ఈ జబ్బుకి రష్యా టీకా తయారు చేసింది. అప్పట్లో కోవిడ్ కి ఎలాగైతే మొట్టమొదటిసారిగా టీకా తయారు చేసిందో ఇప్పుడు ఈ ప్రాణాంతక క్యాన్సర్ కి కూడా వ్యాక్సిన్ చేసింది కూడా రష్యానే అవుతుంది.
కరోనాకి ఎలాగైతే ప్రపంచంలోనే ముందుగా టీకా తయారు చేసిందో అలానే రష్యా గమేలియా ఇన్ స్టిట్యూట్ క్యాన్సర్ కి కూడా వ్యాక్సిన్ తయారు చేసింది. దానిపై హ్యుమన్ ట్రయల్స్ కూడా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటిగా క్యాన్సర్ అని చెప్పొచ్చు. దీని బారిన పడితే కోలుకోవడం అంత ఈజీ కాదు. అయితే, క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఇక మీదట మరింత సులభతరం కానుంది. పైసా ఖర్చు పెట్టకుండానే క్యాన్సర్ బారి నుంచి బయటపడొచ్చు.
స్పుత్నిక్ -వీ ని ఎలాగైతే మెసెంజర్ RNA నుంచి టీకా తయారు చేసిందో అలానే ఇది కూడా ఎంఆర్ఎన్ ఏ నుంచే మెలనోమా వ్యాక్సిన్ తయారు చేసింది. ఈ టీకా క్యాన్సర్ ట్రీట్ మెంట్ చరిత్రలోనే ఒక అద్భుతంగా సంస్థ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్ బర్గ్ అభివర్ణించారు. ప్రతి వ్యక్తి జెనెటిక్ ప్రొఫైల్ ఆధారంగా క్యాన్సర్ కణతులపై ఈ టీకా పని చేస్తుందని చెప్పారాయన. ఎంఆర్ ఎన్ ఏ అంటే జన్యు క్రమంలోని కీలక సమాచారాన్ని మోసుకొచ్చే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఈ టీకా ఇచ్చిన తర్వాత శరీంలోకి ఎలాంటి హాని కలిగించని క్యాన్సర్ యాంటిజెన్లను ఉత్పత్తి చేసేలా కణాలు ప్రేరేపితం అవుతాయి. అలా నిజంగా క్యాన్సర్ కనుక వస్తే ఎలా నిరోధించవచ్చో కణాలకు ఆటోమేటిక్ గా వ్యాధి నిరోధకత సంక్రమిస్తుంది.
mRNA వ్యాక్సిన్ పై రష్యా ఇప్పటికే చాలామార్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్ జరిపిందని తెలుస్తోంది. 2024లోనే రష్యా ఈ టీకా తయారీని ప్రారంభించగా ఇప్పుడు సెప్టెంబర్ నుంచి హ్యుమన్ ట్రయల్స్ ఏర్పాటయ్యాయి. రష్యాలో ఇది పూర్తిగా ఉచితంగా అందించనుండగా ఇతర దేశాల్లో మాత్రం విక్రయాలకు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మందులు వాడకుండానే థైరాయిడ్ నయం.. ఈ 5 రకాల ఫుడ్ తో అద్భుతమైన ఫలితాలు