ఫ్రెండ్‌ కోసం…ప్రాణాలకు తెగించి మొసలితో పోరాడిన బాలిక

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 07:34 AM IST
ఫ్రెండ్‌ కోసం…ప్రాణాలకు తెగించి మొసలితో పోరాడిన బాలిక

Updated On : October 30, 2019 / 7:34 AM IST

జింబాబ్వేలో ఓ విద్యార్థిని ఒక పెద్ద మొసలితో ప్రాణాలకు సైతం పోరాడి తన స్నేహితురాలిని కాపాడింది. ఈ ఘటన సింటెరెలా గ్రామంలో చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి ఈత కొడుతున్నప్పుడు లటోయా మువానీ అనే 9 ఏళ్ల బాలిక మొసలి పై దాడి చేసింది.

సింటెరెలా గ్రామంలో రెబెక్కా మున్‌కోంబ్వే, లటోయా మువానీ అనే 9ఏళ్ల బాలికలు.. తమ స్నేహితురాళ్లతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకెళ్లారు. అక్కడ లటోయా ఈత కొడుతుండగా.. ఓ మొసలి ఆమెను పట్టుకుంది.

వెంటనే రెబెక్కా మొసలిపై దూకింది. దాని కళ్లల్లో దాడి చేయడంతో లటోయాను మొసలి కొద్దిగా వదిలింది. దీంతో లటోయా గాయాలతో మొసలి నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం లటోయాను చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. తన బిడ్డ ప్రాణాలు కాపాడిన తండ్రి రెబెక్కాను అభినందించారు.