కుక్కలు చెడ్డ వాళ్లను ఇట్టే పసిగట్టేస్తాయంటోన్న సైన్స్

Dogs Sense: పెంపుడు జంతువును పెంచుకోవాలనుకున్నప్పుడు కుక్క.. పిల్లి రెండింటిలో ఏది కావాలనుకుంటారు. అది మన ఇష్టం బట్టి కాదు వాటి స్వభావం బట్టి ఎంచుకోవాలి. ఎందుకంటే పిల్లులతో పోలిస్తే కుక్కల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అవి మనుషుల నుంచి ఎమోషన్స్ ఎక్స్ పర్ట్ చేస్తాయట.
భారీ ఎత్తున జరిపిన సైంటిఫిక్ రీసెర్చ్ లో కుక్కలకు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుందని.. అవి మనుషుల ఎమోషన్స్ పట్ల చాలా సెన్సిటివ్ గా ఉంటాయని తేలింది. అంతేకాదు కుక్కలు నమ్మకస్థులని, చెడ్డవారిని ఇట్టే పసిగట్టేస్తాయట.
జపాన్ లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన అకికో టకోకా జరిపిన స్టడీలో తమను మోసం చేసేవారిని కుక్కలు నమ్మవని తేలింది. వాటిని పట్టించుకోని వాళ్లను కూడా అవి ఖాతరు చేయవట. మనుషులను అంచనా వేయడానికి కుక్కలు వాటి అనుభవాలను వినియోగించుకుంటాయట.
ఈ ప్రయోగం 34కుక్కలపై మూడు భాగాలుగా జరిపారు. మొదటి పార్ట్ లో కుక్కలకు వాటి యజమానులు ఫుడ్ పట్టుకుని నిల్చొంటే అవి వారి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లాయి. రెండో పార్ట్ లో నిల్చొని ఫుడ్ కంటైనర్ల వైపుకు చూపిస్తే అటే పరిగెత్తాయి. మూడోసారి కంటైనర్ల వైపు చూపించినా పరిగెత్తకుండా ఆగిపోయాయి. అంటే అంతకుముందు ఖాళీ కంటైనర్ చూపించినట్లే ఈ సారి అలాగే అయి ఉండొచ్చని ఆగిపోయాయి.
కుక్కలు చెడ్డ వారిని గుర్తించడం వెనుక ఉన్న సైన్స్ తెలుసా.. సిక్స్త్ సెన్స్ తో పనిచేయడంలో కుక్కలు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. చెడ్డ ఆలోచనలతో లేదా.. చెడు చేయాలనుకునే తలంపుతో ఉండే వారి గుండె కొట్టుకోవడం ఎక్కువ అవుతుందట. అప్పుడు అడ్రినలైన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అయి మామూలు సమయం కంటే ఎక్కువ చెమట విడుదల అవుతుందట.
కుక్కలు ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండటంతో స్మెల్ సెన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాసనలను సెకన్ల వేగంతో పసిగట్టేస్తాయి. కాబోయే ప్రమాదాలు, చెడ్డ వైబ్స్ లను ఈజీగా సెన్స్ చేసుకోగలుగుతాయి. అలా పసిగట్టడం వల్ల పిరికివాటిగా మారిపోవడం లేదా హైపర్ అగ్రెసివ్ గానూ మారిపోతాయని సైన్స్ చెబుతుంది.