600 million years old sea Himalayan mountains
Sea found in Himalayas : కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను వెలికి తీసి ఈ ప్రపంచానికి సాటిచెప్పే పరిశోధకులు మరో అద్భుతాన్ని కనుగొన్నారు. హిమాయాల్లో ఎన్నో నదులు జన్మించి ఈ భూమిని సస్యశ్యామలం చేస్తున్నాయి. కానీ హిమాలయాల్లో నదులే కాదు సముద్రం కూడా ఉందని కనుగొన్నారు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( Indian Institute of Science Bengaluru(IISc), జపాన్‌లోని నీగాటా యూనివర్సిటీ (Japan Niigata University)శాస్త్రవేత్తలు. హిమాలయాల(Himalayas)లో దాదాపు 600 మిలియన్ సంవత్సరాల క్రితం (dating back approximately 600 million years) సముద్రం (sea)ఉండేదని వారి పరిశోధనల్లో గుర్తించారు. మంచు బిందువుల్లో దాగిఉన్న చరిత్రను కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రీకాంబ్రియన్ రీసెర్చ్( Precambrian Research)లో ప్రచురించబడింది. హిమాలయాల్లో క్యాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్ నిక్షేపాలలో పురాతన సముద్ర నీటి బిందువులను కనిపెట్టామని ఐ.ఐ.ఎస్.సి (IISc)గురువారం (జులై27,2023)ప్రకటనలో వెల్లడించింది.
హిమాలయాలలో దాదాపు 600 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రం ఉండేదని..ఆ సముద్రంలో నుంచి మిగిలిపోయిన ఖనిజ నిక్షేపాలలో చిక్కుకున్న నీటి బిందువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి చరిత్రకు సంబంధించిన ఆక్సిజనేషన్ ఏర్పడటానికి దారి తీసిన సంఘటనలను గురించి తమ అధ్యయనంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ నిక్షేపాలు పశ్చిమ కుమయోన్ హిమాలయాలలో లభించాయి.
దాదాపు 70 కోట్ల ఏళ్ల క్రితం భూమి అంతా మంచుతో కప్పబడి ఉండేది. దీన్ని స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ ( Snowball Earth glaciation)అని పిలువబడే సుదీర్ఘమైన హిమనీనదానికి గురైందని శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పట్లో నదుల నుంచి సముద్రాలకు చేరే నీటి పరిమాణం బాగా తక్కువుండేదట. బహుశా అలా సముద్రాల్లో చేరే నీటి పరిమాణం తక్కువ కాబట్టి సముద్రాలకు కాల్షియం సరిగా అందేది కాదని వారు అంచనా వేశారు. కాల్షియం అందకపోవటం వల్ల నీటిలో జీవించే జలచరాలకు పోషకాలు అందకుండాపోయేవి. అటువంటి వాతావరణ పరిస్థితులు కిరణజన్య సంయోగ క్రియ చేయగల సైనోబ్యాక్టీరియాకు అత్యంత అనువైనదని..ఆ బ్యాక్టీరియా భూ వాతావరణంలోకి పెద్దఎత్తున ఆమ్లజనిని విడుదల చేశాయని తెలిపారు. పుష్కలంగా ఆమ్లజని లభించడంతో భూమిపై జీవజాతులు విస్తరించాయిని అలా విస్తరించి ఎన్నో కోట్ల సంఖ్యలో విస్తరించాయని శాస్త్రవేత్త ఆర్య తెలిపారు. శాస్త్రవేత్తలు ఈ అవశేషాల అధ్యయనంతో భూమిపై సముద్రాలు, జీవజాతుల పరిణామంపై అవగాహన పెంచుకోవచ్చని భావిస్తున్నారు.
Apple Company Shoes : యాపిల్ కంపెనీ షూస్ .. ధర వింటే షాకే
పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తల బృందం హిమాలయాలలో అమృత్‌పుర్ నుంచి మిలామ్ హిమనీనాదం వరకు..అలాగే డెహ్రాన్ డూన్ నుంచి గంగోత్రి వరకు సముద్రాల ఉనికి కోసం అన్వేషణ సాగించారు. అలా అదృశ్యమైన సముద్రల ఉనికి కోసం అన్వేషించగా పురాతన సముద్రపునీటి ఉనికిని గుర్తించారు. వీరి పరిశోధనలు భూమి చరిత్రకు సంబంధించి మహా సముద్రాల ఉనికి వాటి పరిణామక్రమానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కాగా..సింధు, బ్రహ్మపుత్ర, గంగ వంటి ఎన్నో నదులు హిమాలయాల్లో జన్మించినవే. ఇవే కాకుండా మరెన్నో నదులకు హిమాలయాలు జన్మస్థానం. అటువంటి ఎన్నో నదులకు మరెన్నో ఉపనదులు ఉన్నాయి. అలా హిమాలయాల్లో జన్మించిన నదులు ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తు కోట్ల జీవరాశుల మనుగడకు ఆలవాలంగా ఉన్నాయి.