Amazon : ఆర్డర్ చేయకుండానే మహిళకు 100పైగా పార్శిల్స్, ఆమె ఎక్కడుంటే అక్కడికే ఎందుకొస్తున్నాయి? వాటిలో ఏమున్నాయంటే..

ఆమె ఇంటికి గుట్టలు గుట్టలుగా అమెజాన్ నుంచి పార్శిల్స్ వస్తున్నాయి. అలా ఒకేరోజుల్లో 100కుపైగా పార్శిల్స్ వచ్చాయి. ఇలా చాలాసార్లు ఆమెకు అలా పార్శిల్స్ వస్తున్నాయి. దీనికి అమెజాన్ చేసే ఆలోచనే కారణమా....అలా ఎందుకు చేస్తోంది. ఆమెకే ఎందుకిలా జరుగుతోంది. ఎందుకు ఆమెకే అన్ని పార్శిల్స్ అమెజాన్ పంపింస్తోంది..?

Amazon : ఆర్డర్ చేయకుండానే మహిళకు 100పైగా పార్శిల్స్, ఆమె ఎక్కడుంటే అక్కడికే ఎందుకొస్తున్నాయి? వాటిలో ఏమున్నాయంటే..

woman 100 Amazon packages never ordered

Updated On : July 29, 2023 / 2:32 PM IST

100 Amazon packages she never ordered : ఆన్ లైన్ లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిందని ఐఫోన్ ఆర్డర్ చేస్తే జ్యూస్ వచ్చిందని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చూసి ఉంటాం. కానీ ఓ మహిళకు మాత్రం అమెజాన్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమే ఏమీ అర్ఢర్ చేయకుండానే ఒకటీ రెండు కాదు ఏకంగా 100కుపైగా పార్శిల్ వచ్చాయి ఆమెకు. దీంతో ఆమె షాక్ అయ్యారు.

అమెజాన్ ( Amazon packages)నుంచి వర్జీనియాకు చెందిన ఒక మహిళ​​(Virginia woman)కు వింత అనుభవం ఎదురుకాగా.. అనూహ్యంగా వచ్చిన ఆ పార్శిల్స్ ను ఏం చేయాలో తెలియక కారులో వేసుకుని తిరుగుతున్నానని..ఆ ఆర్డర్ చేసిన వ్యక్తులు ఎవరో తెలిస్తే వాటిని వాళ్లకు ఇచ్చేస్తాని చెబుతున్నారామె. దాని కోసం ఆ పార్శిల్స్ ను కారులో వేసుకుని తిరగాల్సి వస్తోందని తెలిపారు.  వర్జీనియాకు చెందిన సిండీ స్మిత్‌ (Cindy Smith)అనే మహిళ ఎవరో ఆర్డర్ చేసిన పార్శిల్స్ తనకు వచ్చాయని వారెవరో తెలిస్తే వారికి ఇచ్చేస్తానని చెబుతున్నారు.  ప్రిన్స్‌ విలియం కౌంటీలో నివసిస్తున్న ఆమె ఇంటికి వచ్చిన వాటిలో ఏమున్నాయోనని వాటిని సిండీ తెరిచి చూశారు. వాటిలో 1,000 హెడ్‌ల్యాంప్‌లు, 800 గ్లూగన్‌లు, డజన్ల కొద్దీ బైనాక్యూలర్స్ ఉన్నాయని తెలిపారు. వాటిని తిరిగి ప్యాక్ చేసేసానని.. ఇప్పుడు తాను వీటిని కారులో పెట్టుకుని తిరుగుతున్నానని,ఆ పేరుగలవారు ఎవరైనా కనిపిస్తే వారికి ఇ‍చ్చేస్తానని తెలిపారు సిండి.

Apple Company Shoes : యాపిల్ కంపెనీ షూస్ .. ధర వింటే షాకే

ప్యాకేజీలపై అడ్రస్ ఉన్న పేరు లిక్సియావో జాంగ్‌ (Lixiao Zhang)అని సిండీ తెలిపారు. ఈ పేరుగల వారు ఎవ్వరు తనకు తెలియదని తెలిస్తే వాటిని వారికి అందజేస్తానని తెలిపారు. ఈ పార్శిల్స్ తనకు రావటంతో దీంట్లో ఏదో మోసం ఉందని కావాలనే తనను ఇబ్బందులకు గురిచేయటానికి ఎవరో పంపించారని తాను అనుకున్నానని..ఇదేదో స్కామ్ అని ఆందోళన చెందానని తెలిపారు. కానీ ఇది తనకు ఎదురైనా ఇటువంటి సిట్యువేషన్ మొదటిసారి కాదని..ఒకప్పుడు తాను వాషింగ్టన్‌ డీసీలోని లిజ్‌ గోల్ట్‌మెన్‌లో ఉండేదానికి అప్పుడు కూడా ఇలానే జరిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను ఎటువంటి ఆర్డర్‌ చేయకుండానే చిన్నపిల్లల దుప్పట్లు చాలానే వచ్చాయని తెలిపారు. అంతేకాదు..తను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు కూడా ఇటువంటిదే జరిగిందని.. అప్పుడ కూడా తాను ఎటువంటి ఆర్డర్ చేయకుండానే 100 స్పేస్‌ హీటర్లు వచ్చాయని ఇలా తనకే ఎందుకు జరుగుతోందో అర్థం కావట్లేదని అంతా అయోమయంగా ఉందని తెలిపారు. ఇలా వచ్చిన పార్శిల్స్ ను భద్రపరచటం ఇంట్లో పెట్టుకోవటం పెద్ద తలనొప్పిలా మారిందని ఆమె వాపోయారు.

Airplane: విమానంలో ప్రయాణీకులను ఎడమవైపు నుంచే ఎందుకు ఎక్కిస్తారో తెలుసా? దీనికి పెద్ద కారణమే ఉంది ..

తాజాగా ఆమెకు వచ్చిన పార్శిల్స్ విషయంపై అమెజాన్‌ ప్రతినిధులు స్పందిస్తు.. ఆమెకు వస్తున్న ఆర్డర్లను పరిశీలిస్తే స్మిత్, గెల్ట్‌మాన్ పేరుతో ఉ‍న్న ప్యాకేజీలు రెండూ అమ్మకందారులు అమెజాన్ కేంద్రాల నుండి అనుకోకుండా అడ్రస్ లకు ప్యాకేజీలను పంపినందువల్లేనని తెలిపారు. కానీ అమెజాన్ సంస్థ అమ్ముడుపోని ప్రొడక్టులను స్టోరేజీని తగ్గించుకునేందుకు కొన్ని అడ్రస్ లను ఎంచుకుని ఇలా చేస్తున్నారు అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అంటే గతంలో అమెజాన్ లో ఆర్డర్స్ చేసిన ప్రస్తుతం మానేసినవారి అడ్రస్సులకు ఇలా పంపిస్తున్నారని..అటువంటివారి అడ్రస్సులకు తమ స్టోరేజీని తగ్గించుకోవటానికి ఇలా పంపిస్తున్నారని అంటున్నారు.