life under the ice of Antarctica : ప్రకృతిలో దాగున్న రహస్యాలు, వింతల్లో మరో కొత్త విషయాన్ని శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. గ్లేసియర్లు, మంచు పర్వతాలతో నిండిపోయిన అంటార్కిటికాలో జీవం ఉండి ఉండేదన్న సమాచాన్ని నిర్ధారిస్తున్నారు. మంచు కొండలోని 3 వేల అడుగుల కింది భాగాన జీవాన్ని గుర్తించారు.
సముద్రపు ఉపరితలం మీద అత్యంత శీతలమైన మంచు గడ్డ.. అంటార్కిటికాలోనే ఉంది. పూర్తిగా గడ్డకట్టి ఉన్న ఆ ప్రాంతంలో ఇటీవల శాస్త్రవేత్తలు డ్రిల్లింగ్ చేశారు. జీవం మనుగడ అసాధ్యమైన ఆ ప్రాంతంలో జీవం ఆనవాళ్లను కనుగొన్నారు. ఆ మంచు కొండల్లో రెండు గుర్తు తెలియని జంతువులను గుర్తించారు.
ఆహారం లేని చోట.. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఉన్న ఈ ప్రాంతంలో జీవం బతికి ఉండే అవకాశం లేదని ఇప్పటివరకు అనుకున్నారు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.