Nigeria : నైజీరియాలో విషాద ఘటన.. తొక్కిసలాటలో చిన్నారులు మృతి

నైజీరియాలోని హాలిడే ఫన్ ఫెయిర్ లో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటుచేసుకోవడంతో దాదాపు 30 మందికిపైగా చిన్నారులు ,,

Nigeria Tragedy

Nigeria : నైజీరియాలోని హాలిడే ఫన్ ఫెయిర్ లో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటుచేసుకోవడంతో దాదాపు 30 మందికిపైగా చిన్నారులు మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో మరికొందరు చిన్నారు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఓయో రాష్ట్రంలోని బసోరన్ లో ఇస్లామిక్ హైస్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర గవర్నర్ సెయి మకిండే స్పందించారు. ఈ దుర్ఘటనలో మరింత ప్రాణ నష్టం జరగకుండా భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులను అరెస్టు చేశారు. అయితే, హాలిడే ఫన్ ఫెయిర్ లో ఐదు వేల మంది వరకు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Also Read: Youtuber Bhanu Chander Arrest : తిక్క కుదిరింది.. రోడ్డుపై డబ్బులు విసిరేసిన ఆ యూట్యూబర్ అరెస్ట్..

ఈ ఘటనపై సెయి మకిండే ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున ఇస్లామిక్ హై స్కూల్ బసోరున్‌లో విషాద సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తు, వేదిక వద్ద జరిగిన తొక్కిసలాట వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఓయో రాష్ట్రంలో ఉన్న మాకు ఇది చాలా విచారకరమైన రోజు. ఈ ఘటనలో మరణించిన చిన్నారుల తల్లిదండ్రులకు సానుభూతి తెలియజేస్తున్నాము. మృతుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు వెంటనే భద్రతా బలగాలను రంగంలోకిదింపి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. వైద్య సిబ్బందిని, అంబులెన్స్‌లను కూడా వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ విషాద ఘటనపై విచారణ కొనసాగుతుంది. ఈ తొక్కిసలాటకు దారితీసిన ఈవెంట్ నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు’’ అని తెలిపారు.