Youtuber Bhanu Chander Arrest : తిక్క కుదిరింది.. రోడ్డుపై డబ్బులు విసిరేసిన ఆ యూట్యూబర్ అరెస్ట్..
సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదని, అరెస్ట్ చేసి లోపల వేస్తామని, కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Youtuber Bhanu Chander Arrest : మనీ హంట్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్ పైన డబ్బులు విసిరేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన యూట్యూబర్ భాను చందర్ కి పోలీసులు తిక్క కుదిర్చారు. అతగాడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రోడ్డుపై డబ్బులు విసిరేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు భాను చందర్. ఓఆర్ఆర్ పైన మనీ హంట్ చాలెంజ్ పేరుతో భాను చందర్ డబ్బులు విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిపై ఓఆర్ఆర్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఘట్ కేసర్ పోలీసులు విచారణ చేపట్టారు. రోడ్డు పై డబ్బు విసిరేసిన ఆ యూట్యూబర్ కు బుద్ధి చెప్పారు. అతడిని వెతికి పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు ఇలాంటి చిల్లర పనులు చేస్తే ఊరుకునేది లేదని, అరెస్ట్ చేసి లోపల వేస్తామని, కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
”రోడ్డు పై విసిరేసినవి ఫేక్ నోట్లు కాదు రియల్ నోట్లే అని అతడు అంటున్నాడు. అవి నకిలీ నోట్లా ఒరిజినల్ కరెన్సీనా అన్నది మా విచారణలో తేలుతుంది. ఆ డబ్బు ఎవరికి దొరికిందో కూడా తెలీదు. సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయండి. మహిళలకి ఉపయోగడాలి. అలాంటి వీడియోలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ, ఇలాంటి చట్ట వ్యతిరేకమైన వీడియోలు చేసి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే చిక్కులు తప్పవు. కేసులు అవుతాయి, అరెస్ట్ అవుతారు. కోర్టుల చుట్టూ తిరుగుతారు” అని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
Also Read : ఈ విగ్గురాజా మామూలోడు కాదు.. పెళ్లి పేరుతో 50మంది అమ్మాయిలను మోసం చేసిన కేటుగాడు..