Tunisia Ship : ట్యునీషియా తీరంలో మునిగిన 750 టన్నుల డీజిల్‌ ట్యాంకర్ నౌక..

Tunisia Ship : ట్యునీషియా సముద్రతీరంలో భారీ డీజిల్ ట్యాంకర్ నౌక మునిగిపోయింది. 720 టన్నుల డీజిల్ రవాణా చేస్తున్న ఈ నౌక ప్రతికూల వాతావరణం కారణంగా సముద్ర జలాల్లో మునిగిపోయింది.

Tunisia Ship : ట్యునీషియా సముద్రతీరంలో భారీ డీజిల్ ట్యాంకర్ నౌక మునిగిపోయింది. 720 టన్నుల డీజిల్ రవాణా చేస్తున్న ఈ నౌక ప్రతికూల వాతావరణం కారణంగా సముద్ర జలాల్లో మునిగిపోయింది. గినియాకు చెందిన జెలో ట్యాంకర్ ఈజిప్టులోని డామిట్టా పోర్ట్ నుంచి బయల్దేరింది. ఐరోపాలోని మాల్టా దీవికి 750 టన్నుల డీజిల్ రవాణా చేస్తోంది. సముద్రపు జలాల్లో ఉన్నట్టుండి ప్రతికూల వాతావారణం ఎదురైంది. ఆ పరిస్థితుల్లో ట్యునీషియా జలాల్లో ఎంట్రీ కోసం ట్యాంకర్ సిబ్బంది అనుమతి కోరారు.

ఈలోగా ట్యునీషియా ఆగ్నేయ తీరంలో గల్ఫ్ ఆఫ్ గేబ్స్ వద్ద డీజిల్ ట్యాంకర్ సముద్రంలోకి మునిగిపోయింది. ట్యునీషియా సముద్ర జలాల్లోనే ఆ భారీ డీజిల్ నౌక మునిగిందని నౌకా అధికారులు చెబుతున్నారు. డీజిల్ ట్యాంకర్ మునిగిపోవడంతో అందులోని చమురు తెట్టు సముద్ర జలాలను కలుషితం చేసే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Ship Carrying 750 Tonnes Of Fuel Sinks Off Tunisia’s Southeast Coast

మునిగిన నౌకలో ఏడుగురు సిబ్బందిని రక్షించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. సముద్రంలో మునిగిన నౌకలో నుంచి ఎలాంటి లీకేజీ లేదని అంటున్నారు. డీజిల్ నౌకలోని చమురును సురక్షితంగా బయటకు తీసేందుకు ట్యునీషియా విపత్తు నివారణ కమిటీ సమావేశం కానున్నట్టు అధికారులు తెలిపారు.

Read Also : Iran’s Largest Navy Ship: సముద్రంలో మునిగిన ఇరాన్ అతిపెద్ద​ నేవీ ఓడ

ట్రెండింగ్ వార్తలు