Iran’s Largest Navy Ship: సముద్రంలో మునిగిన ఇరాన్ అతిపెద్ద​ నేవీ ఓడ

ఇరాన్ నేవీకి చెందిన అతిపెద్ద ఓడ ఒకటి గల్ఫ్ ఆఫ్ ఒమన్​ సముద్రంలో మునిగిపోయింది. అగ్నిప్రమాదం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ఇరాన్ మీడియా తెలిపగా..

Iran’s Largest Navy Ship: సముద్రంలో మునిగిన ఇరాన్ అతిపెద్ద​ నేవీ ఓడ

Iran’s Largest Navy Ship

Iran’s Largest Navy Ship: ఇరాన్ నేవీకి చెందిన అతిపెద్ద ఓడ ఒకటి గల్ఫ్ ఆఫ్ ఒమన్​ సముద్రంలో మునిగిపోయింది. అగ్నిప్రమాదం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ఇరాన్ మీడియా తెలిపగా.. ఈ ఓడను ప్రస్తుతం శిక్షణకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఓడలో ఉన్న సిబ్బంది సహా అందరూ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. చెలరేగిన మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది.

తెల్లవారుజామున 2:25 గంటలకు ఓడలో మంటలు మొదలవగా అగ్నిమాపక సిబ్బంది దానిని అదుపు చేయడానికి ప్రయత్నించినా అది వీలుపడలేదని తెలుస్తుంది. పెర్షియన్ గల్ఫ్ యొక్క ఇరుకైన హార్ముజ్ జలసంధి సమీపంలో ఓమన్ గల్ఫ్‌లో టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 1,270 కిలోమీటర్ల ఇరాన్ ఓడరేవు జాస్క్ సమీపంలో ఈ నౌక మునిగిపోయింది. ప్రమాదం జరగగానే సహాయక బృందాలతో ఓడలోని వారందరినీ సురక్షితంగా తరలించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.