Shocking video : అపార్ట్ మెంట్‌‌లో మంటలు..పైపు ద్వారా తప్పించుకున్నారు

తొలుత అమ్మాయి అక్కడనే నిలబడింది. వెంటనే బాలుడు కూడా అదే విధంగా చేశాడు. కిందనున్న వారు భయంభయంగా చూశారు. వారు ఎక్కడ కిందపడుతారనే చూస్తుండగా...

Fire

2 Teenagers Slide Down Pipe : న్యూయార్క్ నగరంలోని 14 అంతస్తులున్న భవనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుక్కున్న ఇద్దరు టీనేజర్లు అపార్ట్ మెంట్ పైపుల నుంచి జారి ప్రాణాలను రక్షించుకున్నారు. ఎక్కడ పడుతారనే ఉత్కంఠ నడుమ వారు క్షేమంగా దిగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. షాకింగ్ గురి చేసే ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి..సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈస్ట్ విలేజ్ లో భవంతిలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగో అంతస్తులో కూడా మంటలు చెలరేగాయి.

Read More : Alappuzha : కేరళను వణికిస్తున్న రాజకీయ హత్యలు..పది గంటల్లో ఇద్దరు మృతి

దీంతో ఇంట్లో ఉన్న 18 ఏళ్ల అమ్మాయి, 13 ఏళ్ల బాలుడు అక్కా తమ్ముళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు ప్రయత్నించారు. పొగలు తీవ్రం కావడంతో…తొలుత కిటికీ గుండా బయటకు వచ్చారు. కానీ..ఎలా కిందకు వెళ్లాలో అర్థం కాలేదు. చివరకు వారు పక్కనే ఉన్న పైపు సాయం ద్వారా కిందకు వెళ్లాలని అనుకున్నారు. తొలుత అమ్మాయి అక్కడనే నిలబడింది. వెంటనే బాలుడు కూడా అదే విధంగా చేశాడు. కిందనున్న వారు భయంభయంగా చూశారు. వారు ఎక్కడ కిందపడుతారనే చూస్తుండగా..ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే బాలుడు..జరజరా అంటూ..కిందకు జారడం..అతని సోదరి కూడా కిందకు జారడం వీడియోలో కనిపించింది.

Read More : Ap Capital Heat: హీటెక్కిన రాజధాని రాజకీయం.. శ్రీశైలం టూ అమరావతి చైతన్య యాత్ర

ఈ ఘటనలో వారి తల్లికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. అక్కడనే ఉన్న వైద్యులు వారిని పరీక్షించి…ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు, వారి తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భవంతిలో అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అపార్ట్ మెంట్ లోపల ఎలక్ట్రిక్ బైక్ లున్నట్లు..ప్రమాదం జరగడానికి ఇవే కారణమా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.