Shooting In School : స్కీడన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్వీడన్ ఒరెబ్రో సిటీలోని స్కూల్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు హతమార్చారు. దేశ చరిత్రలోనే ఇదొక భయంకరమైన ఘటనగా పోలీసులు అధికారులు అభివర్ణించారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెస్ట్ స్టాక్ హోమ్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే విద్యా సంస్థలో ఈ ఘటన జరిగింది. కాల్పుల గురించి తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. స్కూల్ ని చుట్టుముట్టారు. తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విద్యార్థులను, స్టాఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
స్కూల్ లో కాల్పుల ఘటనతో స్వీడెన్ ఉలిక్కిపడింది. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. కాల్పుల ఘటనతో ఒరెబ్రో ప్రాంతంలోని ఇతర విద్యాసంస్థల యాజమాన్యాలు అలర్ట్ అయ్యాయి. పిల్లలను, స్టాఫ్ ను విద్యాసంస్థల లోపలే ఉంచేశాయి. పోలీసుల సలహా మేరకు వారు ఇలా చేశారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతంలో నివాసం ఉండే వారిని ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు చెప్పారు. తాము చెప్పే వరకు ఎవరూ బయటకు రావొద్దన్నారు.
కాల్పులు జరిపిన దుండగుడు ఎవరు? ఎందుకు జరిపాడు? అతడి లక్ష్యం ఏంటి? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. దీనిపై ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత పోలీసులు సెక్యూరిటీని పెంచారు.