Cyber Crime : బాప్ రే.. ఒక్క ఫోన్ కాల్‌తో 11 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగిని.. బీకేర్ ఫుల్ అంటున్న పోలీసులు.. ఏం జరిగిందో తెలిస్తే షాకే..

అది నిజమో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటలను నమ్మేసింది.

Cyber Crime : బాప్ రే.. ఒక్క ఫోన్ కాల్‌తో 11 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగిని.. బీకేర్ ఫుల్ అంటున్న పోలీసులు.. ఏం జరిగిందో తెలిస్తే షాకే..

Updated On : February 3, 2025 / 9:49 PM IST

Cyber Crime : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వారి ఎరకు చిక్కామా ఇక అంతే సంగతులు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం. సైబర్ క్రైమ్స్ గురించి పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

తాజాగా అలాంటి ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది. సైబర్ క్రిమినల్స్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని బెదిరించి ఏకంగా 11 లక్షలు స్వాహా చేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : భర్త కిడ్నీ రూ.10 లక్షలకి అమ్మేసి లవర్ తో పారిపోయిన మహిళ..

ఆన్‌లైన్‌లో మీరు గంజాయి కొన్నారని భయపెట్టి..
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఘరానా సైబర్ క్రైమ్ బయటపడింది. ఐటీ ఉద్యోగినికి ఫోన్ వచ్చింది. ఆన్‌లైన్‌లో మీరు గంజాయి కొన్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని ఆమెను బెదిరించారు. అంతేకాదు.. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు స్పెషల్‌ పోలీసులు వస్తున్నారని ఆమెను ఫోన్‌లో భయపెట్టారు. వారి మాటలకు ఆమె బాగా భయపడిపోయింది.

అరెస్ట్ భయంతో 11 లక్షలు చెల్లించిన ఐటీ ఉద్యోగిని..
అది నిజమో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటలను నమ్మేసింది. కాగా, ఈ కేసు నుంచి బయటపడాలంటే 11 లక్షలు చెల్లించాలని ఆమెతో చెప్పాడు. అప్పటి బాగా భయపడిపోయిన ఐటీ ఉద్యోగిని.. కేసు, అరెస్ట్ అనగానే వణికిపోయింది. ఏమాత్రం ఆలోచన చేయకుండానే ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్ కు ఆన్‌లైన్‌లో రూ.11 లక్షలు ట్రాన్సఫర్ చేసింది.

Also Read : ఎంత కర్మ పట్టిందిరా అయ్యా నీకు.. దొంగగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ఎందుకో తెలిస్తే షాకే..

ఆ వెంటనే ఫోన్ కట్ అయ్యింది. కాసేపటి తర్వాత ఆమె ఆ నెంబర్ కు కాల్ చేసింది. ఆ నెంబర్ స్విచ్చాఫ్ అని వచ్చింది. అప్పటికి కానీ ఆమెకు అర్థం కాలేదు.. తాను మోసపోయాయని. అది తెలిసిన వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ఘరానా సైబర్ క్రైమ్ మోసం స్థానికంగా సంచలనంగా మారింది.

కాగా, సైబర్ క్రైమ్స్ గురించి పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేసి బెదిరింపులకు దిగితే భయపడొద్దని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. సైబర్ నేరాల గురించి ఇంత అవగాహన కల్పిస్తున్నా.. ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.