Ex MLA Son Becomes Thief : ఎంత కర్మ పట్టిందిరా అయ్యా నీకు.. దొంగగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ఎందుకో తెలిస్తే షాకే..

ఇతగాడి హిస్టరీ తెలుసుకుని పోలీసులు ఒకింత అవాక్కయ్యారు. అతడి తండ్రి మాజీ ఎమ్మెల్యే అని తెలిసి విస్తుపోయారు.

Ex MLA Son Becomes Thief : ఎంత కర్మ పట్టిందిరా అయ్యా నీకు.. దొంగగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ఎందుకో తెలిస్తే షాకే..

Updated On : February 3, 2025 / 5:55 PM IST

Ex MLA Son Becomes Thief : అతడు ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు. ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి కొడుకు అంటే.. సమాజంలో అతడికి అంతో ఇంతో గుర్తింపు ఉంటుంది. ఉన్నత విద్యావంతుడై ఉండాలి. కాస్త డిగ్నిటీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇదీ జనాల్లో ఉండే అభిప్రాయం. అయితే, ఆ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ మాజీ ఎమ్మెల్యే పుత్రరత్నం దొంగగా మారాడు. అదేంటి.. అలా ఎందుకు మారాడు? అతడికి అంత కర్మ ఏం పట్టింది? అనే డౌట్ వచ్చే ఉంటుంది.

గర్ల్ ఫ్రెండ్ కోసం దొంగగా మారిన వైనం..
ఆ వ్యక్తి దొంగగా మారింది ఎవరి కోసమో తెలుసా.. లవర్ కోసం. అవును.. తన గర్ల్ ఫ్రెండ్ అవసరాలను తీర్చేందుకు ఆ వ్యక్తి దొంగ అవతారం ఎత్తాడు. చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు.

ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. గర్ల్ ఫ్రెండ్ అవసరాలు తీర్చేందుకు మాజీ ఎమ్మెల్యే కొడుకు దొంగ అవతారం ఎత్తాడు. ఆమె అవసరాలు తీర్చాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కుని పారిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

తండ్రి మాజీ ఎమ్మెల్యే.. కొడుకు దొంగ..
నిందితుడిని మానస నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విజేంద్ర సింగ్ చంద్రావత్ కుమారుడు ప్రద్యుమాన్ సింగ్ గా గుర్తించారు పోలీసులు. ఇతగాడి హిస్టరీ తెలుసుకుని పోలీసులు ఒకింత అవాక్కయ్యారు. అతడి తండ్రి మాజీ ఎమ్మెల్యే అని తెలిసి విస్తుపోయారు. అయితే, ప్రద్యుమాన్ సింగ్ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో ఉండటం లేదట.

Also Read : భర్త కిడ్నీ రూ.10 లక్షలకి అమ్మేసి లవర్ తో పారిపోయిన మహిళ..

బ్యాంకులో ఉద్యోగి, నెలకు రూ.12వేల జీతం..
వారికి దూరంగా అహ్మదాబాద్ లో ఉంటున్నాడట. ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. జీతం నెలకు 12వేల రూపాయలట. ప్రద్యుమాన్ సింగ్ కు గర్ల్ ఫ్రెండ్ ఉంది. తనకు వచ్చే జీతంతో ఆమె అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. అంతే, ఈజీ మనీ కోసం ఇదిగో ఇలా దొంగగా మారిపోయాడు.

”ప్రద్యుమాన్ సింగ్… బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె ఖరీదైన కోరికలు తీర్చేందుకు అతడి జీతం డబ్బులు సరిపోలేదు. దీంతో డబ్బు కోసం దొంగగా మారాడు. 65ఏళ్ల వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. నిందితుడు ప్రద్యుమాన్ కొంత కాలంగా అహ్మదాబాద్ లో నివాసం ఉంటున్నాడు. బ్యాంకులో పని చేస్తున్నాడు. నెల జీతం 12వేల రూపాయలు.

వృద్ధురాలి మెడలోంచి చైన్ స్నాచింగ్..
65 ఏళ్ల వృద్ధురాలు వాసంతి అయ్యర్ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. సడెన్ గా వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆమె మెడలోంచి బంగారు గొలుసు తెంపేందుకు ప్రయత్నించాడు. అది రాకపోవడంతో కట్టర్ సాయంతో కట్ చేసి చైనా లాక్కెళ్లాడు. ఆ మంగళసూత్రం రెండున్నర తులాలు ఉంటుంది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read : అయ్యో పాపం.. ఈ అవ్వకి ఎంత కష్టం వచ్చింది..! జైల్లో ఉండేందుకు నేరాలు చేస్తుందట..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగ కోసం గాలించారు. చివరికి దొంగను గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశాం. అతి పేరు ప్రద్యుమాన్ సింగ్. అతడు మాజీ ఎమ్మెల్యే కొడుకు. అతడి వద్ద నుంచి లక్ష 25వేల రూపాయల విలువ చేసే గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకున్నాం.

విచారణ సమయంలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే అని చెప్పాడు. ఆయన పేరు విజేంద్ర సింగ్ చంద్రావత్. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. తన గర్ల్ ఫ్రెండ్ అవసరాలు, కోరికలు తీర్చేందుకు.. ఆర్థిక సమస్యల నుంచి గట్టేందుకు దొంగగా మారానని పోలీసుల విచారణలో ప్రద్యుమాన్ సింగ్ అంగీకరించాడు” అని పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసు వివరాలను వెల్లడించారు.