Wife Elope With Lover : భర్త కిడ్నీ రూ.10 లక్షలకి అమ్మేసి లవర్ తో పారిపోయిన మహిళ..

తమ సుఖాల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఒకరినొకరు మోసం చేసుకునే వాళ్లూ ఉన్నారు.

Wife Elope With Lover : భర్త కిడ్నీ రూ.10 లక్షలకి అమ్మేసి లవర్ తో పారిపోయిన మహిళ..

Updated On : February 2, 2025 / 9:50 PM IST

Wife Elope With Lover : భార్య, భర్త అంటే.. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త.. కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటారు. ఒకరి క్షేమం మరొకరు కోరుకుంటారు. ఎలాంటి కష్టం వచ్చినా తోడు విడవరు. అదీ భార్య, భర్తల మధ్య ఉండే అనుంబంధం. అయితే, అందరూ అలానే ఉంటారనుకుంటే పొరపాటే.

కొందరు తమ స్వార్ధం మాత్రమే చూసుకుంటారు. తమ సుఖాల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఒకరినొకరు మోసం చేసుకునే వాళ్లూ ఉన్నారు. ఓ మహిళ ఇలాంటి దారుణానికే ఒడిగట్టింది. లవర్ కోసం దిగజారిపోయింది. ఏకంగా భర్త కిడ్నీ రూ.10 లక్షలకి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని లవర్ తో పారిపోయింది.

Also Read : అయ్యో పాపం.. ఈ అవ్వకి ఎంత కష్టం వచ్చింది..! జైల్లో ఉండేందుకు నేరాలు చేస్తుందట..

ప్రియుడితో పారిపోయేందుకు ఖతర్నాక్ ప్లాన్..
వెస్ట్ బెంగాల్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హౌరా జిల్లా సంక్రైల్ లో నివాసం ఉండే ఓ వివాహిత తన లవర్ తో పారిపోయి ఎంజాయ్ చేసేందుకు ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఎలాగైనా డబ్బు సంపాదించాలని స్కెచ్ వేసింది. కూతురి చదువు, పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు ఆదా చేద్దామని భర్తతో చెప్పింది. అందుకోసం కిడ్నీ అమ్మేయాలని భర్తపై ఒత్తిడి తెచ్చింది.

కిడ్నీ అమ్మేయాలని భర్తపై ఒత్తిడి..
ఇలా రోజూ భర్తపై ఒత్తిడి చేస్తూనే ఉంది. కొన్నాళ్లు మౌనంగా ఉన్న భర్త.. భార్య పెట్టే నస భరించలేక చివరికి తన కిడ్నీ అమ్మేందుకు ఒప్పుకున్నాడు. కిడ్నా కొనే వారి కోసం ఏడాది పాటు వెతికాడు. చివరికి ఆ వ్యక్తి దొరికాడు. కిడ్నీ అమ్మగా 10లక్షల రూపాయలు వచ్చాయి. కిడ్నీ అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అతడు ఆశించాడు. అంతేకాదు భవిష్యత్తులో తన కూతురి పెళ్లికి ఆ డబ్బు ఉపయోగపడుతుందని భావించాడు. అయితే, తన భార్య కుట్ర గురించి అతడికి అస్సలు తెలియదు.

Also Read : వైసీపీ నుంచి వలసలు.. నాగబాబు సంచలనం.. మంత్రి పదవిపై హాట్ కామెంట్స్..

కిడ్నీ అమ్మగా వచ్చిన రూ.10లక్షల తీసుకుని లవర్ తో జంప్..
ఆ మహిళ ఫేస్ బుక్ లో పరిచయమైన పెయింటర్ తో సంబంధం పెట్టుకుంది. 10 లక్షలు తీసుకుని ప్రియుడితో పారిపోయి ఎంజాయ్ చేయాలని స్కెచ్ వేసింది. ఓ రోజు భర్తకు తెలియకుండా డబ్బు తీసుకుని ఆమె తన ప్రియుడితో పారిపోయింది. ఈ విషయం తెలిసి భర్త షాక్ తిన్నాడు. తాను మోసపోయానని తెలుసుకుని అతడు ఎంతో బాధపడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.