Software Engineer Incident : వీడిని ఏం చేసినా పాపం లేదు..! ఆ వీడియోలతో ఐటీ ఉద్యోగినిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాడు, ఏకంగా 2కోట్ల 53 లక్షలు వసూలు, అయినా ఇంకా వేధింపులు..

ఆ డబ్బుతో గుంటూరులో లగ్జరీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్, కారు కొన్నారు. దాదాపు కేజీ బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేశారు. అంత డబ్బు ఇచ్చినా వారి ఆశ తీరలేదు.

Software Engineer Incident : వీడిని ఏం చేసినా పాపం లేదు..! ఆ వీడియోలతో ఐటీ ఉద్యోగినిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాడు, ఏకంగా 2కోట్ల 53 లక్షలు వసూలు, అయినా ఇంకా వేధింపులు..

Updated On : February 4, 2025 / 5:46 PM IST

Software Engineer Incident : హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోనిని మోసం చేసి 2 కోట్ల 53 లక్షలు కాజేసిన మధు సాయికుమార్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తూర్పుగోదావరి జిల్లా నిదడవోలు పోలీసులు కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1.80 కోట్లు రికవరీ చేశారు పోలీసులు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో నిడదవోలుకు చెందిన నందిని నివాసం ఉంటోంది.

అదే హాస్టల్ లో నివసిస్తున్న ఓ యువతి భర్త సాయికుమార్.. నందినికి పరిచయం అయ్యాడు. కెనడాకు పంపుతానని నందినిని అతడు నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలి ప్రైవేట్ వీడియోలు తీసి ఆమెను బెదిరించాడు. దీంతో నిందితుడికి బాధితురాలు పలు దఫాలుగా డబ్బులు ఇచ్చింది. అలా 2 కోట్ల 53 లక్షల రూపాయలు చెల్లించింది.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్, లక్షల్లో జీతం..
నిడదవోలుకు చెందిన రంగస్వామి నందిని హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తోంది. ఆమె ఉంటున్న హాస్టల్ లోనే ఉండే మరో మహిళ నందినితో పరిచయం ఏర్పరచుకుంది. ఆ తర్వాత తన భర్త సాయికుమార్ ను కూడా నందినికి పరిచయం చేసింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావడం, లక్షల్లో జీతం వస్తుండటంతో నందినిపై భార్యభర్తల కన్ను పడింది.

Also Read : బాప్ రే.. ఒక్క ఫోన్ కాల్‌తో 11 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగిని.. బీకేర్ ఫుల్ అంటున్న పోలీసులు.. ఏం జరిగిందో తెలిస్తే షాకే..

పలు దఫాలుగా 2 కోట్ల 53 లక్షలు వసూలు..
ఎలాగైనా నందిని నుంచి డబ్బు గుంజాలని స్కెచ్ వేశారు. ఈ క్రమంలో నీ ప్రైవేట్ వీడియోలు మా దగ్గర ఉన్నాయంటూ నందినిని వారు బెదిరించారు. అవి బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి బెదిరింపులతో భయపడిపోయిన బాధితురాలు.. వారి అడిగినంత డబ్బు ఇచ్చింది. అలా పలు దఫాలలో ఏకంగా 2 కోట్ల 53 లక్షలు వసూలు చేశారు.

ఆ డబ్బుతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన కేటుగాడు..
ఆ డబ్బుతో సాయికుమార్ దంపతులు లగ్జరీ లైఫ్ లీడ్ చేశారు. ఆ డబ్బుతో గుంటూరులో లగ్జరీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్, కారు కొన్నారు. దాదాపు కేజీ బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేశారు. అంత డబ్బు ఇచ్చినా వారి ఆశ తీరలేదు. మరింత డబ్బు కావాలని బాధితురాలని వేధించారు. దాంతో విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది.

Also Read : ఎంత కర్మ పట్టిందిరా అయ్యా నీకు.. దొంగగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ఎందుకో తెలిస్తే షాకే..

దాదాపు రెండు సంవత్సరాల నుంచి బ్లాక్ మెయిల్..
దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం నడుస్తోందని కొవ్వూరు డీఎస్పీ తెలిపారు. ప్రైవేట్ వీడియోలు బయటకు వస్తే ఎక్కడ తన పరువు పోతుందోనని భయపడ్డ బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. తీవ్ర మనోవేదనకు గురైంది. తన జీతం అంతా వారికే ఇచ్చింది. అదీ కాక అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించింది. కొన్ని ఆస్తులు తనఖా పెట్టి మరీ వారు అడిగిన డబ్బు ఇచ్చింది.

అయినప్పటికీ సాయికుమార్ దంపతుల వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు కావాలని టార్చర్ పెట్టారు. దాంతో బాధితురాలు తట్టుకోలేకపోయింది. పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి చాలా రహస్యంగా దర్యాఫ్తు చేపట్టారు. కేటుగాడు సాయికుమార్, అతడి భార్యను గుంటూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు.

నిందితుడి నుంచి పోలీసులు కోటి 80 లక్షల రూపాయల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే భయపడొద్దని.. ధైర్యంగా ముందుకు వచ్చి తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.