Sikh Men Use Turbans To Rescue Hikers From Waterfall
Sikh Men Use Turbans To Rescue Hikers : ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు ఏది అడ్డురాదని నిరూపించారు సిక్కు యువకులు. మత విశ్వాసాలను కూడా పక్కనపెట్టి మరి.. ఆపదలో ఉన్న ఇద్దరి ప్రాణాలను కాపాడారు సిక్కు సోదరులు. సరైన సమయంలో స్పందించి జలపాతంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించారు.
ఈ ఘటన కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని గోల్డన్ ఇయర్స్ ప్రోవిన్షియల్ పార్క్ వద్ద జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా సిక్కులు తమ టర్బన్(తలపాగా)ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. జలపాతంలో చిక్కుకున్నవారిని ఆ తలపాగాతోనే రక్షించారు.
America : కరోనా తర్వాత భారీగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తోన్న అమెరికన్లు
కుల్జీందర్ కిండా నలుగురు స్నేహితులతో కలిసి పర్వతాధిరోహణకు వెళ్లారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు రాతిపై నడుస్తూ కాలుజారి జలపాతంలో పడిపోయారు. సిక్కు సోదరులు కుల్జీంచర్ కిండా, అతని స్నేహితులు అక్కడే ఉన్నారు. జలపాతంలో చిక్కుకున్నవారిని ఎలా కాపాడాలో తెలియలేదు. అక్కడ వారికి ఏమి దొరకలేదు.
చివరికి చేసేది ఏమిలేక తమ తలపాగాను తాడులా మార్చి వారిని పైకి లాగి రక్షించారు. ఆ ఇద్దరు వ్యక్తులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. సిక్కు సోదరులు తమ టర్బెన్‌లను తాడుగా మార్చి జలపాతంలో చిక్కిన వారిని కాపాడిన వీడియో వైరల్ అయింది. సిక్కులు చేసిన సాహసానికి స్థానిక మీడియాతో పాటు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తులు కుల్జీందర్, అతని స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Russia : వారం రోజులు ఆఫీసులు బంద్..కానీ జీతమిస్తాం