Russia : వారం రోజులు ఆఫీసులు బంద్..కానీ జీతమిస్తాం

రష్యాలో కరోనా కేసులు,మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు(అక్టోబర్-30 నుంచి నవంబర్-7 వరకు) ఉద్యోగులకు

Russia : వారం రోజులు ఆఫీసులు బంద్..కానీ జీతమిస్తాం

Putin

Russia  రష్యాలో కరోనా కేసులు,మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు(అక్టోబర్-30 నుంచి నవంబర్-7 వరకు) ఉద్యోగులకు పెయిడ్ సెలవులు ఇవ్వాలని కేబినెట్ చేసిన ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ ఆమోదం తెలిపారు. అయితే అందులో నాలుగు రోజులు అధికారిక సెలవులే. మరో మూడు రోజులే అదనంగా ఇస్తోంది ప్రభుత్వం.

ఇక రష్యాలో అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పుతిన్ కోరారు. వ్యాక్సిన్ తీసుకోవడాన్ని బాధ్యతగా ఫీల్ అవ్వాలన్నారు. అయితే ప్రపంచంలో మెట్టమొదట గతేడాది రష్యా ప్రభుత్వమే కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ..వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపనందు వల్ల వ్యాక్సినేషన్ నత్త నడకన సాగుతోంది.

రష్యాలో గత వారం రోజులుగా సగటున రోజుకు 1000 కరోనా మరణాలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వైరస్ తీవ్రత అత్యంత ఆందోళనకరంగా ఉంది. దీంతో కొన్ని ఆస్పత్రుల్లో ఇతర వైద్య సేవలను నిలిపివేసి కేవలం కరోనా రోగులకే చికిత్స అందిస్తున్నారు. బుధవారం బుధవారం రికార్డు స్థాయిలో రష్యాలో 1,028 మరణాలు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్ల నుంచి ఇవే అత్యధికం. గడిచిన 24 గంట్లలో రష్యాలో కొత్తగా 34,074 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ALSO READ India-China Standoff : 100 రాకెట్ లాంఛర్లను సరిహద్దుకి తరలించిన చైనా